ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Sandeep Kishan Latest Web Series Streaming Date announced | Sakshi
Sakshi News home page

Sandeep Kishan: సందీప్ కిషన్ కామెడీ ఎంటర్‌టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jun 15 2026 12:49 PM | Updated on Jun 15 2026 12:58 PM

Sandeep Kishan Latest Web Series Streaming Date announced

టాలీవుడ్ హీరో సందీప్‌ కిషన్‌, మిథిలా పాల్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ వీడియోను రిలీజ్‌ చేస్తూ డేట్‌ ప్రకటించారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ తెలుగు వెబ్ సిరీస్‌ జూలై 2 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని  నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా వీడియో రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా వెల్లడించింది. తన జాబ్‌ పర్మినెంట్‌ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఈ సిరీస్‌ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్‌లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్‌బాబు కీలక పాత్రలు పోషించారు.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement