తెలుగు ఆడియెన్స్ కోసం మరో ఓటీటీ | Vihari Telugu OTT Platform To Launch In June | Sakshi
Sakshi News home page

OTT: తెలుగు తొలి ట్రావెల్ ఓటీటీ లాంచ్

May 25 2026 11:13 AM | Updated on May 25 2026 11:22 AM

Vihari Telugu OTT Platform To Launch In June

18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి.. ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి.. ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది.

(ఇదీ చదవండి: కన్నడలోకి బ్రహ్మానందం బయోగ్రఫీ)

ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి.. ఇప్పుడు ఓటీటీ రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్‌కు మాత్రమే అంకితమైన తొలి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా విహారి ఓటీటీలో జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో విహారి ఓటీటీ టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. ఇందులో 'బిగ్ బాస్' ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా 'విహారి ఓటీటీ' గ్లోబల్ విజన్ ఆవిష్కరించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement