కన్నడలోకి బ్రహ్మానందం బయోగ్రఫీ | Brahmanandam Biography Kannada Version Released, First Copy Handed Over To CM Siddaramaiah | Sakshi
Sakshi News home page

Brahmanandam Biography: ముఖ్యమంత్రికి తొలి పుస్తకం అందజేత

May 25 2026 11:02 AM | Updated on May 25 2026 12:42 PM

Brahmanandam Biography Kannada Version Released

వెయ్యికి పైగా సినిమాల్లో కనిపించిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇకపోతే ఈయన బయోగ్రఫీ 'నేను మీ బ్రహ్మానందం' మూడేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయింది. ఇప్పుడు దీన్ని కన్నడలోకి కూడా అనువదించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే తొలి ప్రతిని రచయిత అందజేశారు.

(ఇదీ చదవండి: మళ్లీ సినిమాల్లోకి మాజీ ఉప ముఖ్యమంత్రి)

తెలుగు భాష మాట్లాడలేకపోయినా, దాన్ని బాగా అర్థం చేసుకునే అనువాదకుడిగా బ్రహ్మానందంపై ఉన్న అభిమానంతోనే ఈ ప్రయత్నం చేశారు. ఆయన నటించిన వందలాది సినిమాలు కేవలం ఆయన కోసమే చూశాను. సాధారణ స్కూల్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం.. సినీ రంగంలో ఎదిగిన తీరు ఈ బయోగ్రఫీలో అద్భుతంగా రాశారు. ఈ పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈయన జీవితం కేవలం నటుడి విజయగాథ మాత్రమే కాదు. ఉపాధ్యాయుడు, కళాకారుడు, తత్వవేత్తగా సాగిన తీరు అద్భుతం. కన్నడ అనువాద తొలి ప్రతిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేయడం తనకు చాలా ఆనందంగా అనిపించిందని రచయిత విశ్వేశ్వర భట్ చెప్పారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement