ఓటీటీలోకి సచిన్ బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Sachin Movie OTT Telugu Streaming Update | Sakshi
Sakshi News home page

Sachin Movie OTT: సచిన్ సినిమా.. తెలుగులో సడన్ స్ట్రీమింగ్

May 27 2026 8:55 PM | Updated on May 27 2026 8:55 PM

Sachin Movie OTT Telugu Streaming Update

ఐపీఎల్ చివరకొచ్చేసింది. ఫ్లే ఆఫ్ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారు? ఫైనల్స్‌కి ఎవరొస్తారనే టెన్షన్ క్రికెట్ అభిమానుల్లో గట్టిగా ఉంది. ఇప్పుడు సదరు క్రికెట్ ప్రేమికుల కోసమా అన్నట్లు దిగ్గజ సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ని ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)

సచిన్ టెండూల్కర్ జీవితం, క్రికెట్ జర్నీ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ 'సచిన్ : ఏ బిలియన్ డ్రీమ్స్'. 2017లో థియేటర్లలో రిలీజైన ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీలో సచిన్ క్రీడా జర్నీతో పాటు 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన క్షణాలు, క్రికెట్ గాడ్ స్పీచ్, రేర్ వీడియోస్, మ్యాచ్ ఫుటేజ్‌తో పాటు భారతీయ క్రికెట్ చరిత్రలోని కీలక ఘట్టాలను ఇందులో చూపించారు.

ఇదివరకే హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలుగు, తమిళ వెర్షన్లని ఆహా ఓటీటీలోకి తీసుకురానున్నారు. గురువారం(మే 28) నుంచి తెలుగులో, శుక్రవారం(మే 29) నుంచి తమిళంలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement