ఓటీటీలు వచ్చాక కంటెంట్‌కు కొదువ లేకుండా పోయింది. ప్రతివారంలో సరికొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాల ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. సూపర్ హిట్ అయిన సిరీస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ల మీద సీజన్స్ అలా స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఇటీవలే తెలుగులో సేవ్ ది టైగర్స్ సీజన్-3 అభిమానుల ముందుకొచ్చింది. ఈ కామెడీ సిరీస్ ఓటీటీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.
తాజాగా మరో సక్సెస్‌ఫుల్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు సీజన్స్ సక్సెస్‌ఫుల్ కావడంతో పార్ట్-3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. కోలీవుడ్‌లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ హార్ట్ బీట్. ఓ ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కథాంశంగా తెరకెక్కించారు. ఈ హార్ట్‌బీట్ ఓటీటీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా ఇప్పటికే రెండు సీజన్స్ రాగా.. ఆడియన్స్ ఆదరణ దక్కించుకున్నాయి.
అదే ఊపుతో హార్ట్ బీట్ సీజన్-3 కూడా తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. జూలై 30 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ సిరీస్‌కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు.
One world became two. But the heartbeat remains one. ❤️
Hotstar Specials #HeartBeatSeason3 streaming from July 30 only on #JioHotstar #HBS3 #HBS3OnJHS #HeartBeatS3OnJioHotstar #HeartBeat3OnJioHotstar #HeartBeat3StreamingFromJuly30 #HeartBeatS3FirstLook #JioHotstarTamil… pic.twitter.com/RQFWVdi5uP— JioHotstar Tamil (@JioHotstartam) July 1, 2026


