ఓటీటీకి టాలీవుడ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Tollywood Thriller Web Series Isakapatnam Streaming on This Date | Sakshi
Sakshi News home page

Tollywood thriller: ఓటీటీకి టాలీవుడ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jun 11 2026 9:22 PM | Updated on Jun 11 2026 9:22 PM

Tollywood Thriller Web Series Isakapatnam Streaming on This Date

ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్‌ అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి ఉంటుంది. తెలుగు నేరుగా ఓటీటీ చిత్రాలు రాకపోయినప్పటికీ.. వెబ్ సిరీస్‌లు మాత్రం వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం. 

సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ ఇసాకపట్నం.  టైటిల్ వింటేనే విశాఖ నేపథ్యంలోనే కథ ఉండనుందని అర్థమవుతోంది.  ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సిరీస్‌ రూపొందించారు. ఈ సిరీస్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.

తాజాగా ఈ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు.  జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ పంచుకున్నారు. ఈ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు  కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో 240కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement