Samuthirakhani
-
ఓటీటీకి టాలీవుడ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీలు వచ్చాక సినిమాలు చూసే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచికి తగినట్లుగా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి ఉంటుంది. తెలుగు నేరుగా ఓటీటీ చిత్రాలు రాకపోయినప్పటికీ.. వెబ్ సిరీస్‌లు మాత్రం వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇసాకపట్నం. టైటిల్ వింటేనే విశాఖ నేపథ్యంలోనే కథ ఉండనుందని అర్థమవుతోంది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. ఈ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపారు. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్‌కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో 240కి పైగా దేశాల్లోని ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. -
టాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ మిస్టరీ థ్రిల్లర్ కామాఖ్య. ఈ చిత్రంలో సమైరా, సముద్రఖని, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వడ్డేపల్లి శ్రీ వానినాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఓ మిస్టరీ కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. కానీ ఇలాంటివీ జరిగినప్పుడే అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా? అని భయం వేస్తుంది' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్, మధునందన్, వైష్ణవ్, ధన్‌రాజ్, రాఘవ, ఐశ్వర్య, గడ్డం నవీన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జ్ఞాని సంగీతమందిస్తున్నారు. -
ఖైదీల కోసం స్పెషల్ ప్రీమియర్ షో.. అభినందించిన అధికారులు!
కమెడియన్ ధన్‌రాజ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న తాజా చిత్రం 'రామం రాఘవం'. ఆయనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు.ఇటీవల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలులో స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. జైలులోని దాదాపు 2500 ఖైదీల కోసం సినిమాను జైలులోనే ప్రదర్శించడం విశేషం. ఈ అవకాశం కల్పించిన చర్లపల్లి జైలు అధికారులకు, పోలీస్ విభాగనికి చిత్రయూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఇలాంటి ఒక మంచి అనుభూతిని పొందుతానని కలలో కూడా ఊహించలేదని ధనరాజ్ అన్నారు.ఈ చిత్రం చూసి ఖైదీలు ఎమోషనల్ అయ్యారు. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ అధికారులు మమ్మల్ని అభినందించి ఎంకరేజ్ చేసినట్లు ధనరాజ్ తెలిపారు. రామం రాఘవం చిత్ర యూనిట్ ఇది మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఖైదీల హృదయాల్ని కదిలించిన రామం రాఘవం చిత్రం ప్రేక్షకులని కూడా మెప్పిస్తుందని చిత్రబంద సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.For the first time ever, team #RamamRaghavam 🏹 arranged special Premiere show for Charlapalli Jail prisoners on Gandhi Jayanthi❤️Gratitude to Jail Superintendent #GowriRamachandram garu🤗#RR Coming Soon to theatres🤩@thondankani @DhanrajOffl @suneeltollywood @Mokksha06… pic.twitter.com/xAV27xzNy5— Dhanraj koranani (@DhanrajOffl) October 4, 2024 -
దర్శకుడిగా టాలీవుడ్ నటుడి తొలి సినిమా.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
టాలీవుడ్ నటుడు ధనరాజ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తోన్న చిత్రం "రామం రాఘవం". ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సముద్రఖని , ధనరాజ్ తండ్రీ, కొడుకులుగా కనిపించనున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు నటిస్తున్నారు. ఈ సినిమాకు విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానా కథను సమకూర్చగా.. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది. జగమంతా రామమయం 🙏🏻 ఇలాంటి అద్భుతమైన రోజు నా సినిమా టైటిల్ రిలీజ్ చేయడం నా పూర్వజన్మ సుకృతం 🙏🏻Presenting the first look poster of Love that knows no boundaries 💞 A tale of a father and son!🧡🧡@thondankani @DhanrajOffl @Prudhvi_dir @DirPrabhakar #RR #RamamRaghavam pic.twitter.com/zbQ4u8PXJ7 — Dhanraj koranani (@DhanrajOffl) January 22, 2024 -
తమిళ చిత్రంలో అల్లరి నరేష్
యువతరం హీరోల్లో జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో అల్లరి నరేష్. ఈ మధ్య కాస్త తడబడి స్లో అయ్యాడు కానీ లేదంటే ఈ అల్లరోడు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం సెల్పీరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టాల్ స్టార్ త్వరలో ఓ స్ట్రయిట్ తమిళ సినిమా చేయడానికి అంగకీరించాడు. ఇప్పటికే కురుంబు, పొరలి లాంటి తమిళ సినిమాల్లో నటించిన నరేష్ మరోసారి తమిళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. అల్లరి నరేష్ కీలక పాత్రలో తెరకెక్కిన శంభో శివ శంభో సినిమాకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు సముద్రఖని, ఈ అల్లరోడితో మరోసారి తమిళ సినిమా చేయించాలని డిసైడ్ అయ్యాడు. స్టార్ ఇమేజ్‌కు దూరంగా నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్న పాత్ర కావటంతో నరేష్ కూడా వెంటనే అంగకీరించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. నరేష్ హీరోగా తెరకెక్కిన సెల్పీరాజా ఈ శుక్రవారం రిలీజ్ కాగా మరో రెండు తెలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న మా ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమాలో నటిస్తున్నాడు నరేష్. ఈ సినిమా తరువాత ప్రముఖ నటుడు కృష్ణభగవాన్ కథా కథనాలు అందిస్తున్న మేడ మీద అబ్బాయి సినిమా పటాలెక్కనుంది.


