టాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్‌.. ఆసక్తిగా టీజర్ | Abhinaya Krishna direction Movie Kaamakhya Official Teaser out now | Sakshi
Sakshi News home page

Kaamakhya Official Teaser: రియల్ మిస్టరీ స్టోరీగా కామాఖ్య.. ఆసక్తిగా టీజర్

Mar 20 2026 5:25 PM | Updated on Mar 20 2026 6:42 PM

Abhinaya Krishna direction Movie Kaamakhya Official Teaser out now

జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ మిస్టరీ థ్రిల్లర్‌ కామాఖ్య. ఈ చిత్రంలో సమైరా, సముద్రఖని, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మై ఫిల్మ్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో వడ్డేపల్లి శ్రీ వానినాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌ చూస్తుంటే ఓ మిస్టరీ కేసు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'రోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. కానీ ఇలాంటివీ జరిగినప్పుడే అసలు మనం మనుషుల మధ్య ఉన్నామా? అని భయం వేస్తుంది' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో  ఆనంద్, శరణ్య ప్రదీప్, మధునందన్, వైష్ణవ్, ధన్‌రాజ్, రాఘవ, ఐశ్వర్య, గడ్డం నవీన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాకు జ్ఞాని సంగీతమందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement