ఈ శుక్రవారం ఓటీటీల్లో దృశ్యం-3తో పాటు దురంధర్-2 కూడా మరో ఓటీటీకి వచ్చేసింది. అంతేకాకుండా తెలుగు కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్-3,రవిబాబు రేజర్ మూవీ కూడా ఓటీటీలో సందడి చేస్తోంది. అంతేకాకుండా పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ ఒక్క రోజే స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి.
తాజాగా మరో మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మరీచిక సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ ఏడాది మే 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ రోజు నుంచి ఓటీటీ ప్రియులను అలరిస్తోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమాకు సతీశ్ కసెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక నిర్మించారు.
#Mareechika (Telugu)
Now streaming on PrimeVideo in Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/zjxsplI2Kp— OTT Trackers (@OTT_Trackers) June 19, 2026


