ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Athiradi Movie OTT Streaming Date Latest Update | Sakshi
Sakshi News home page

Athiradi OTT: హిట్ బ్యూటీ కొత్త సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jun 6 2026 3:37 PM | Updated on Jun 6 2026 3:47 PM

Athiradi Movie OTT Streaming Date Latest Update

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు తెలుగునాట చాలా క్రేజ్ ఉంటుంది. ఆ భాషలో తీసిన వివిధ జానర్ల మూవీస్‌ని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. అందుకు తగ్గట్లే డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా గత నెలలో రిలీజై హిట్టయిన కామెడీ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు.

(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)

మలయాళంలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ లేటెస్ట్ యూత్‌ఫుల్ కామెడీ మూవీ 'అతిరథి'. ఇందులోనే టొవిన్ థామస్ మరో హీరోగా నటించాడు. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు హీరోయిన్‌గా చేసింది. గత నెల 14న థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడీ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.

'అతిరథి' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే సామ్ కుట్టి(బాసిల్ జోసెఫ్) తన కాలేజీలో ఆగిపోయిన అరోహన్ ఫెస్ట్‌ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటాడు. కానీ ఇదే కాలేజీలో ఉంటే మరో గ్రూప్ దీన్ని వ్యతిరేకిస్తుంది. మరి చివరకు ఏమైంది? సామ్ కుట్టి తను అనుకున్నది సాధించాడా లేదా? శ్రీకుట్టి(టొవినో థామస్), స్వాతి (రియా షిబు) ఎవరు? అనేది మిగతా స్టోరీ. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.

(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement