breaking news
Riya Shibu
-
సూపర్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్
హీరోయిన్లకు భాషతో సంబంధం లేదు. ఒక భాషకు చెందిన వారు మరొ దానిలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. నయనతార స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలో బోలెడంత గుర్తింపు తెచ్చుకుని చెన్నైలోనే సెటిల్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో మలయాళీ బ్యూటీ చేరేందుకు రెడీ అయింది. ఆమెనే రియా షిబు.మొదట నటిగా ఆకట్టుకున్న ఈమె.. నిర్మాతగా మారి తమిళంలో విక్రమ్‌తో 'వీర ధీర సూరన్' సినిమాని నిర్మించింది. తర్వాత కథానాయకగా అవతారమెత్తి 'సర్వం మాయ' అనే మలయాళ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా పలు రంగాల్లో ప్రతిభ చాటుకుంటున్న రియా.. కోలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. విక్రమ్ హీరోగా చేస్తున్న కొత్త మూవీలో హీరోయిన్గా అవకాశం వరించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అలా ఉండగానే ఇప్పుడు మరో అవకాశం తలుపు తట్టిందని సమాచారం.విజయ్ సేతుపతితో రియా కలిసి నటించడానికి సిద్ధమవుతోందని తెలిసింది. క్రితిక ఉదయనిది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మహిళ దర్శకురాలు ఈసారి కుటుంబ అనుబంధాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తీయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమై ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చిత్రీకరణను జరుపుకొంటున్నట్లు, మరో వారంలో తొలి షెడ్యూల్ పూర్తికాబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. -
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాసిల్ జోసెఫ్, టొవినో థామస్, రియా షిబు ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'అతిరథి'. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. గత నెలలో థియేటర్లలో రిలీజై ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)కథేంటి?ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తుంటరి కుర్రాడు శామ్ కుట్టి (బాసిల్ జోసెఫ్). ఇదే కాలేజీలో రెండేళ్ల క్రితం జరిగిన ఓ విషాదం వల్ల ఆగిపోయిన 'ఆరోహన్' అనే ఫెస్ట్ జరిపించాలని ఇతడు ప్రయత్నిస్తుంటాడు. ఇది కచ్చితంగా చేయాలనుకోవడం వెనక ఓ కారణముంటుంది. తొలి ఏడాది నుంచి అనుకుంటే శామ్ తన ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అందరినీ ఒప్పించి ఫెస్ట్ నిర్వహించేందుకు రెడీ అవుతాడు. కానీ తోట కుట్టన్(టొవినో థామస్) అనే మాజీ రౌడీ రూపంలో అనుకోని అవాంతరం ఎదురవుతుంది. ఇంతకీ శామ్, కుట్టన్ మధ్య గొడవేంటి? స్వాతితో శామ్ ప్రేమకథ ఎంతవరకు వచ్చింది? చివరకు ఫెస్ట్ జరిగిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అతిరథి గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఇంజినీరింగ్ కాలేజీలో ఆగిపోయిన ఓ ఫెస్ట్‌ని చేయడంలో హీరో సక్సెస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఏంటి కథ ఇంతేనా? అసలు ఇందులో చెప్పడానికి, చూపించడానికి ఏముందా అనే సందేహం మీకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ మూవీ టీమ్ బాగానే మేనేజ్ చేశారు. పెద్దగా పాయింట్ లేని స్టోరీని కూడా రెండున్నర గంటల మూవీగా తీశారు. కాకపోతే యావరేజ్ దగ్గరే ఆగిపోయారు.ఓ ఫెస్ట్‌లో ముగ్గురు స్టూడెంట్స్ చనిపోవడంతో సినిమా ప్రారంభమవుతుంది. ఈ విషాదం కారణంగా ప్రతి ఏడాది జరిగే ఫెస్ట్‌ని పూర్తిగా ఆపేస్తారు. అదే కాలేజీలో కొన్నేళ్ల తర్వాత ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాడు శామ్ కుట్టి. అల్లరి చేస్తూ, తుంటరి పనులతో ఎంటర్టైన్ చేసే ఇతడు.. ఈ ఫెస్ట్ కోసం అంతలా ఎందుకు పట్టుబట్టాడు? చివరకు చేయగలిగాడా లేదా అనేది కన్విన్సింగ్‌గానే చూపించారు. అయితే ఇంటర్వెల్ వరకు పెద్దగా స్టోరీ ఏం ఉండదు. సీన్స్ వస్తుంటాయి గానీ బోరింగ్‌గానే ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముందు ఎప్పుడైతే కుట్టన్ పాత్ర ఎంట్రీ ఇస్తుందో అప్పటి నుంచి మూవీలో కాస్త జోష్ వస్తుంది.సెకండాఫ్ అంతా కాలేజీ స్టూడెంట్ శామ్, రౌడీ షీటర్ నుంచి సింగర్‌గా మారాలనే ప్రయత్నాల్లో ఉన్న కుట్టన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ స్టైల్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఫైట్స్ అన్నాం కదా అని ఏదో పెద్దగా ఊహించుకోకండి. చాలా సరదాగా, ఫన్నీగా సాగిపోతుంది. అదే టైంలో సహజంగానూ ఉంటుంది. చాలా మలయాళ చిత్రాల్లో ఉన్నట్లే ఇందులోనూ సాగదీత ఉంటుంది. కాకపోతే చివరకొచ్చేసరికి కాస్తంత ఎమోషనల్ చేసి ముగిస్తారు. కాలేజీలో సాగే స్టోరీ కావడంతో పెద్దగా ట్విస్టులు లాంటివి ఏం ఉండవు. సరదాగా సాగిపోతుంది అంతే. ఈ తరహా మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నించొచ్చు.ఎవరెలా చేశారు?శామ్ కుట్టి పాత్రలో బాసిల్ జోసెఫ్ అదరగొట్టేశాడు. స్వతహాగా దర్శకుడు, నటుడు అయిన ఇతడు.. కాలేజీ కుర్రాడిగానూ ఇందులో సెట్ అయిపోయాడు. కుట్టన్ అనే మాజీ రౌడీగా, సింగర్ అవ్వాలనుకునేవాడిగా టొవినో థామస్ పాత్ర కూడా కాస్తంత ఎంటర్టైనింగ్గానే ఉంది. వీళ్లిద్దరి తర్వాత కిడ్నాప్ అయి ఇబ్బందులు పడే వినీత్ శ్రీనివాసన్ పాత్ర బాగుంది. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు ఇందులో స్వాతి అనే అమ్మాయిగా చేసింది గానీ ఈమెకు అస్సలు స్కోప్ దొరకలేదు. మిగతా యాక్టర్స్ ఓకే ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. స్టోరీ పెద్దగా ఏం లేదు కానీ టైమ్ పాస్ చేయించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైరెక్టర్ పర్లేదనిపించాడు. ఫస్టాప్‌లో కామెడీ సీన్స్ లాంటివి కొన్ని పెట్టుంటే బాగుండేది అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. అభ్యంతరక సీన్స్ ఏం లేవు. ఓవరాల్‌గా అయితే టైమ్ పాస్ కామెడీ మూవీ చూద్దామనుకుంటే 'అతిరథి' ట్రై చేయొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
ఓటీటీలోకి మలయాళ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు తెలుగునాట చాలా క్రేజ్ ఉంటుంది. ఆ భాషలో తీసిన వివిధ జానర్ల మూవీస్‌ని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. అందుకు తగ్గట్లే డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా గత నెలలో రిలీజై హిట్టయిన కామెడీ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు.(ఇదీ చదవండి: సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ)మలయాళంలో హీరో, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ లేటెస్ట్ యూత్‌ఫుల్ కామెడీ మూవీ 'అతిరథి'. ఇందులోనే టొవిన్ థామస్ మరో హీరోగా నటించాడు. 'సర్వం మాయ' ఫేమ్ రియా షిబు హీరోయిన్గా చేసింది. గత నెల 14న థియేటర్లలో రిలీజై ఆకట్టుకుంది. రూ.65 కోట్ల మేర కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడీ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుందని పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చారు.'అతిరథి' విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చదివే సామ్ కుట్టి(బాసిల్ జోసెఫ్) తన కాలేజీలో ఆగిపోయిన అరోహన్ ఫెస్ట్‌ని తిరిగి ప్రారంభించాలని అనుకుంటాడు. కానీ ఇదే కాలేజీలో ఉంటే మరో గ్రూప్ దీన్ని వ్యతిరేకిస్తుంది. మరి చివరకు ఏమైంది? సామ్ కుట్టి తను అనుకున్నది సాధించాడా లేదా? శ్రీకుట్టి(టొవినో థామస్), స్వాతి (రియా షిబు) ఎవరు? అనేది మిగతా స్టోరీ. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కామెడీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.(ఇదీ చదవండి: రెండో రోజుకే దారుణంగా పడిపోయిన 'పెద్ది' కలెక్షన్)(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
అందంగా 'సర్వం మాయ' డెలులు.. గ్లామరస్ 'స్పిరిట్' బ్యూటీ
కేరళ చీరకట్టులో అందంగా 'డెలులు' రియా షిబుగ్లామర్తో మెరిసిపోతున్న 'స్పిరిట్' తృప్తి దిమ్రిజిమ్లో తెగ కష్టపడిపోతున్న సంయుక్త మేనన్అద్దం ముందు పొట్టి జీన్ స్కర్ట్‌లో ఈషా రెబ్బాసోయగాలతో రచ్చ లేపుతున్న జాన్వీ కపూర్సిల్క్ చీరలో నవ్వుతూ కావ్య కల్యాణ్ రామ్ View this post on Instagram A post shared by Riya Shibu (@riyashibu_) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Eeshaa Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
కొత్త క్రష్ మలయాళ బ్యూటీ రియా శిబు
-
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెలుగులోనూ కాస్తంత ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నివీన్ పౌలీ. ఈ చిత్రం తర్వాత యాక్టింగ్ అయితే చేస్తున్నాడు గానీ సరైన హిట్ దొరకలేదు. దాదాపు పదేళ్ల తర్వాత 'సర్వం మాయ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ హిట్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)నివీన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ తదితరుల ప్రధాన పాత్రల్లో నటించిన 'సర్వం మాయ'.. గత నెల 25న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‌తో తెలుగు మూవీ లవర్స్ మధ్య చర్చకు కారణమైంది. దీంతో ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో మూవీ అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది.'సర్వం మాయ' విషయానికొస్తే.. ఇదో అందమైన దెయ్యం కథ. ఇది మిమ్మల్ని భయపెట్టదు, నవ్విస్తుంది. చివరకు కంటతడి పెట్టిస్తుంది. ప్రభేందు (నివీన్ పౌలీ) ఓ గిటారిస్ట్. ఇతడి తండ్రి, అన్నయ్య పురోహితులు. కుటుంబం పౌరోహిత్యం చేస్తున్నప్పటికీ ప్రభేందుకి వీటిపై, దేవుడిపై పెద్దగా నమ్మకముండదు. అలాంటి ఇతడి జీవితంలోకి డెలులూ (రియా షిబు) అనే ఓ టీనేజ్ దెయ్యం వస్తుంది. ఈమె రాకతో ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. గతం మర్చిపోయిన ఈ క్యూట్ దెయ్యం.. చివరకు ఎలా ముక్తి పొందింది అనేది స్టోరీ. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అస్సలు మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)Malayalam film #SarvamMaya (2025) by #AkhilSathyan, premieres Jan 30th on @JioHotstar.@NivinOfficial #RiyaShibu @AjuVarghesee #PrietyMukundhan #Janardhanan #RaghunathPaleri #Vineeth #MadhuWariar @justin_tunes #FireflyFilms @APIfilms pic.twitter.com/lw5HDIBQp2— CinemaRare (@CinemaRareIN) January 23, 2026 -
ఏం మాయ చేశావే!.. వెండితెరపై మరో మల్లూ సెన్సేషన్ (ఫొటోలు)


