మూడోసారి సేవ్ ది టైగర్స్.. ట్రైలర్‌తోనే నవ్వులే నవ్వులు..! | Tollywood Comedy Series Save The Tigers Seaon 3 Trailer Out now | Sakshi
Sakshi News home page

Save The Tigers- 3: ముచ్చటగా మూడోసారి.. టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు..!

May 30 2026 6:02 PM | Updated on May 30 2026 6:40 PM

Tollywood Comedy Series Save The Tigers Seaon 3 Trailer Out now

మగాళ్ల బాధలను కామెడీ కోణంలో ప్రేక్షకులకు రుచి చూపించిన వెబ్ సిరీస్‌ సేవ్ ది టైగర్స్. ఇ‍ప్పటికే రిలీజైన రెండు సీజన్స్‌ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇందులో పెళ్లి చేసుకున్న ప్రతి మగాడి పరిస్థితిని కళ్లకు అద్దం కట్టినట్లు చూపించారు. దీంతో ఈ కామెడీ సిరీస్‌ సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు సీజన్స్‌ సినీ ప్రియులను మస్తు ఎంటర్‌టైన్‌ చేశాయి.

ఇప్పుడు మూడో సీజన్‌ కూడా సరికొత్తగా మీ ముందుకొస్తోంది. తాజాగా ఈ సేవ్ ది టైగర్స్-3 ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌ చూస్తుంటే నవ్వుల వర్షం కురుస్తోంది. ఎవడ్రా చెప్పింది ‘పెళ్లంటే పండు వెన్నెల.. పెళ్లామంటే నిండు పున్నమి అనే అభినవ్ గోమఠం డైలాగ్ తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ కామెడీ వెబ్ సిరీస్‌ జూన్‌లోనే జియోహాట్‌స్టార్‌లో సందడి చేయనుంది.

అభినవ్‌ గోమఠం. ప్రియదర్శి, చైతన్యకృష్ణ పండించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్‌ ముచ్చటగా మూడోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించనుంది. ఈ వెబ్ సిరీస్‌ జూన్ 19 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, గుండు సుదర్శన్, మిర్చి కిరణ్, అభయ్ బేతిగంటి, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం సీజన్-3 ట్రైలర్ చూసేయండి. 
‌ 
 

Advertisement
 
Advertisement
Advertisement