ఓటీటీలోకి 'సూపర్ గర్ల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Super Girl Movie OTT Release Date Confirmed After Box Office Struggles, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Super Girl OTT: హాలీవుడ్ మూవీ.. ఓటీటీ అధికారిక ప్రకటన

Jul 7 2026 9:55 AM | Updated on Jul 7 2026 10:58 AM

Super Girl Movie OTT Streaming Update

సూపర్ హీరో కాన్సెప్ట్ అనగానే చాలామందికి హాలీవుడ్ సినిమాలే గుర్తొస్తాయి. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్, అవెంజర్ తదితర స్టోరీలతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అలా ఈ తరహా కథతో వచ్చిన లేటెస్ట్ మూవీ 'సూపర్ గర్ల్'. ఇప్పుడీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంపై అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇంతకీ ఇది ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)

మిల్లీ ఆల్కాక్ లీడ్ రోల్ చేసిన సినిమా 'సూపర్ గర్ల్'. డీసీ సంస్థ నిర్మించింది. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే 100 మిలియన్ డాలర్లకు పైగా నష్టాలు చవిచూసింది. టాక్ కూడా యావరేజ్ వచ్చింది. విజువల్స్, నటి ఫెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ స్టోరీలో పెద్ద పస లేకపోవడం, ఎమోషన్స్ వర్కౌట్ కాకపోవడంతో జనాలకు పెద్దగా నచ్చలేదు. ఇప్పుడీ చిత్రాన్ని ఈనెల 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

'సూపర్ గర్ల్' విషయానికొస్తే.. క్రిప్టన్ గ్రహం నాశనమైన తర్వాత భూమికి చేరిన కరా జోర్ ఎల్ (సూపర్ గర్ల్)కి చెందిన స్పేస్ డాగ్ క్రిప్టో.. విలన్ (క్రిమ్) చేతిలో విషప్రయోగానికి గురవుతుంది. దీంతో అతడిని కాపాడుకోవడానికి సూపర్ గర్ల్.. అంతరిక్ష ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది? చివరకు క్రిప్టోని కాపాడిందా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement