మరో ఓటీటీకి మార్క్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Kannada star Sudeep Mark Movie streaming in another Ott | Sakshi
Sakshi News home page

Mark Movie Ott: మరో ఓటీటీలో మార్క్.. ఆ ఒక్క భాషలోనే స్ట్రీమింగ్

May 29 2026 7:51 PM | Updated on May 29 2026 8:14 PM

Kannada star Sudeep Mark Movie streaming in another Ott

కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్‌'. గతేడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్‌ తదితరులు నటించారు. దర్శకుడు  విజయ్‌ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 23 నుంచే కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది.

తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ‍అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్‌లో ఈ మూవీ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రకంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో బాక్సాఫీస్ వద్ద కాస్తా నిరాశపరిచింది. యాక్షన్‌ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్‌ ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement