ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ | Mystery Thriller Veerabhadruni Rahasyam Series OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT: వీరభద్రుడి స్టోరీతో తెలుగు థ్రిల్లర్.. నేరుగా ఓటీటీలోకి

Jun 23 2026 10:06 AM | Updated on Jun 23 2026 10:32 AM

Veerabhadruni Rahasyam Series OTT Streaming Details

సూర్య హీరోగా చేసిన 'వీరభద్రుడు' గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. పదిరోజుల క్రితం ఓటీటీలోకి కూడా వచ్చింది. ‍ఇప్పుడు అదే వీరభద్రుడి బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఓ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ప్రోమో వీడియోని కూడా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

బంగారం గురించి ఆశ ఎక్కువైనప్పుడు.. మహిళ మీద మోజు పెరిగినప్పుడు.. కీర్తి కావాలనే ఆశ పెరిగినప్పుడు కలి పురుషుడు వస్తాడు అని చెబుతూ ఉన్న ప్రోమో అయితే బాగానే ఉంది. దీన్ని ఈ శుక్రవారం(జూన్ 19) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. మొత్తం 60 ఎపిసోడ్ల సిరీస్‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతివారం ఒకటి రెండు ఎపిసోడ్స్ అందుబాటులోకి వస్తాయి.

తెలుగులో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆని, రఘుకుంచె తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మరి థ్రిల్లర్ సిరీస్ కాబట్టి కచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. లేదంటే ప్రేక్షకులు లైట్ తీసుకునే అవకాశముంది. ఇలా 60 అంతకంటే ఎక్కువ ఎపిసోడ్ల తరహాలోనే హాట్‌స్టార్‌లో పలు సిరీస్‌లు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. 'ప్రేమలు' భామ హీరోయిన్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement