ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. 'ప్రేమలు' భామ హీరోయిన్ | Muthassi Series OTT Streaming Details | Sakshi
Sakshi News home page

OTT: క్షుద్రపూజల కాన్సెప్ట్.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jun 22 2026 2:52 PM | Updated on Jun 22 2026 3:12 PM

Muthassi Series OTT Streaming Details

ఓటీటీలోకి ఎ‍ప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. అలా ఈ వారం కూడా అవతార్ 3, బ్లాస్ట్, లింగం లాంటి మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరో హారర్ థ్రిల్లర్ సిరీస్ కూడా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. 'ప్రేమలు' మూవీలో సహాయ నటిగా చేసిన అఖిల ఇందులో లోడ్ రోల్ చేయడం విశేషం. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: హీరోల వల్ల కానిది సమంత చేసి చూపించింది)

మలయాళంలో తీసిన లేటెస్ట్ సిరీస్ 'ముతశ్శి'. కేపీఏసీ లీల, అఖిల భార్గవన్, రాజేశ్ శర్మ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని ఈ శుక్రవారం(జూన్ 26) నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు వెర్షన్ గురించి ప్రస్తుతానికైతే సమాచారం లేదు గానీ డబ్బింగ్ చేసే అవకాశమైతే ఉంది.

'ముతశ్శి' విషయానికొస్తే.. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లో ఉండే ఊరిలో రాజన్ దంపతులు నివసిస్తుంటారు. వీళ్లకు శ్రీ కుట్టన్ అనే కొడుకు కూడా ఉంటాడు. చాన్నాళ్ల తర్వాత పూర్వీకుల ఇంటికి వెళ్లాలని వీళ్లు నిర్ణయించుకుంటారు. కానీ అక్కడికెళ్లిన తర్వాత వింత సంఘటనలు జరుగుతాయి. కుట్టన్.. దెయ్యం పట్టిలా వాడిలా ప్రవర్తిస్తాడు. దీనికి రాజన్ తల్లి గతంలో చేసిన క్షుద్రపూజలే కారణమని తెలుస్తుంది. మరి కుట్టన్‌ని దెయ్యం బారి నుంచి తల్లిదండ్రులు ఎలా రక్షించుకున్నారనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement