ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Kollywood Movie 29 will be Streaming On This Ott | Sakshi
Sakshi News home page

Kollywood Movie: ఓటీటీకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

May 31 2026 11:15 AM | Updated on May 31 2026 11:47 AM

Kollywood Movie 29 will be Streaming On This Ott

ఓటీటీలు వచ్చాక ఏ సినిమా అయినా సరే తెగ చూసేస్తున్నారు. కాస్తా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఏ భాషలో తెరకెక్కించినప్పటికీ డబ్బింగ్‌ చేసి ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో కథ నచ్చితే చాలు ఎలాంటి మూవీకైనా ఆదరణ దక్కుతోంది. దీంతో డబ్బింగ్‌ చేసినా చిత్రాలే ఎక్కువగా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.  

తాజాగా ఓ తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విధు, ప్రీతి అస్రాని జంటగా నటించిన 29 చిత్రం మే 8న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా స్టార్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీని ఖరారు చేశారు.

జూన్ 5 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా 29 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా రివీల్ చేసింది. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ సినిమాకు రత్న కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేంద్రన్ , అవినాష్, షెనాజ్ ఫాతిమా, ప్రేమ్ కుమార్ కీలక పాత్రల్లో మెప్పించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement