ఓటీటీలోకి రూ.6000 కోట్ల కలెక్షన్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.. | Blockbuster Sci-Fi Movie Project Hail Mary OTT Release Date Out, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ వద్ద రూ.6000 కోట్ల కలెక్షన్స్‌.. ఓటీటీలోకి వచ్చేస్తోంది

Jul 2 2026 9:03 AM | Updated on Jul 2 2026 9:40 AM

Project Hail Mary Movie OTT Release Date Out

ఈ ఏడాది ఇండియన్‌ బాక్సాఫీస్‌ని ‘దురంధర్‌ 2’ షేక్‌ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా మాత్రం హాలీవుడ్‌ మూవీ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ రఫ్పాడించింది. అంతరిక్ష నేపథ్యంగా సాగే ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్‌ చిత్రానికి ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చిలో  విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంది.తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. నగరాల్లో మంచి రెస్పాన్స్ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా రూ.6000 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. జులై 3 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే రెంటల్‌ పద్దతిలో యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.

ప్రాజెక్ట్‌ హెయిల్‌ మేరీ కథేంటంటే.. 
రేల్యాండ్ గ్రేస్(ర్యాన్ గాస్లింగ్) అనే ఓ వ్యోమగామి  గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది మిగతా స్టోరీ. ఇలాంటి కంటెంట్‌తో గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి కానీ..విజువల్స్‌  అద్భుతంగా ఉండడంతో సరికొత్త సినిమా చూశామనే ఫీలింగ్‌ కలుగుతుంది. అంతరిక్ష నేపథ్య సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement