breaking news
Project Hail Mary Movie
-
ఓటీటీలోకి రూ.6000 కోట్ల కలెక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్‌ని ‘దురంధర్ 2’ షేక్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా మాత్రం హాలీవుడ్ మూవీ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ రఫ్పాడించింది. అంతరిక్ష నేపథ్యంగా సాగే ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ చిత్రానికి ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంది.తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. నగరాల్లో మంచి రెస్పాన్స్ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా రూ.6000 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. జులై 3 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రెంటల్ పద్దతిలో యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కథేంటంటే.. రేల్యాండ్ గ్రేస్(ర్యాన్ గాస్లింగ్) అనే ఓ వ్యోమగామి గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది మిగతా స్టోరీ. ఇలాంటి కంటెంట్‌తో గతంలోనూ చాలా సినిమాలు వచ్చాయి కానీ..విజువల్స్ అద్భుతంగా ఉండడంతో సరికొత్త సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. అంతరిక్ష నేపథ్య సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. తెలుగులోనూ
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమా బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా చూసేస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ మూవీస్ వరకు పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలా ప్రపంచవ్యాప్తంగా రూ.3500 కోట్లు సొంతం చేసుకున్న ఓ హిట్ మూవీ.. సైలెంట్‌గా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ)మార్చిలో దేశవ్యాప్తంగా 'ధురంధర్ 2' హవా నడిచింది. ఇదొచ్చిన వారానికి రిలీజైన హాలీవుడ్ మూవీనే 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ'. అంతరిక్ష నేపథ్యంగా సాగే సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లోనూ రిలీజైన ఈ చిత్రం.. నగరాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. చూసిన చాలామంది మెచ్చుకున్నారు. ఇప్పుడీ చిత్రం నెలన్నర తర్వాత యూట్యూబ్ మూవీస్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్(ర్యాన్ గాస్లింగ్) అనే ఓ వ్యోమగామి ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అసలు స్పేస్‌లోకి ఎందుకెళ్లాడు? ఇతడితో పాటు అంతరిక్ష నౌకలో ఉన్న మిగతా ఇద్దరూ ఎందుకు చనిపోయారు? తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? ఈ క్రమంలోనే ఓ ఏలియన్‌తో ఎలా స్నేహం కుదిరిందనేది మిగతా స్టోరీ.అంతరిక్ష నేపథ్య సినిమాలు ఇష్టముంటే మాత్రం దీన్ని కచ్చితంగా మిస్ అవ్వొద్దు. ప్రస్తుతానికి యూట్యూబ్‌లోకి రెంట్ విధానంలో వచ్చింది. త్వరలోనే అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ తదితర ఓటీటీల్లోకి కూడా రావొచ్చు.(ఇదీ చదవండి: రేంజ్ రోవర్ గిఫ్ట్.. ప్రభాస్‌లా ఎవరూ చేయరు : ‘బుజ్జిగాడు’ నటి)


