యూట్యూబ్‌లో ఫ్రీగా లెటెస్ట్‌ హారర్‌ కామెడీ చిత్రం | Chettu Meeda Deyyam Nakem Bhayam Movie Streams Free On Youtube While Running In Theatres, Deets Inside | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌లో ఫ్రీగా తెలుగు హారర్‌ కామెడీ చిత్రం

Jul 2 2026 1:55 PM | Updated on Jul 2 2026 2:25 PM

Chettu Meeda Deyyam Nakem Bhayam Movie OTT Streaming Details

సాధారణంగా సినిమాలు తొలుత థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతాయి. ఆ తర్వాత ఓటీటీలోకి వస్తాయి. పెద్ద సినిమాలు అయితే నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తే..చిన్న సినిమాలు రెండు, మూడు వారాల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఓ తెలుగు సినిమా మాత్రం థియేటర్స్‌లో ఉండగానే ఫ్రీగా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అదే  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ హారర్‌ కామెడీ చిత్రం జూన్‌ 26న థియేటర్స్‌లో రిలీజ్‌ అయింది. ఒకవైపు థియేటర్స్‌లో ఆడుతుండగానే యూట్యూబ్‌ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ టైమ్స్ యూట్యూబ్‌ చానల్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్‌ అవుతోంది. 

ఈ సందర్భంగా దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న సపోర్ట్, లవ్ మాటల్లో చెప్పలేనిది. మా కోసం ఇంతగా నిలబడిన ప్రేక్షకుల కోసం సినిమాను ఉచితంగా ఇవ్వలేనా ఏంటి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయవచ్చు’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement