ఓటీటీలో పెద్ది.. ఆ విషయంలో నో క్లారిటీ..! | Makers No Clarity On Peddi Movie Ott Release Version | Sakshi
Sakshi News home page

Peddi Movie: ఓటీటీలో పెద్ది.. ఆడియన్స్‌లో ఫుల్ కన్‌ఫ్యూజన్..!

Jul 7 2026 7:14 PM | Updated on Jul 7 2026 7:42 PM

Makers No Clarity On Peddi Movie Ott Release Version

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది.

ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 9 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం ఆడియన్స్‌ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ప్రేక్షకులు పెద్ది ఓటీటీ వర్షన్‌పై క్లారీటీ కోరుకుంటున్నారు. ఈ మూవీలోని జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రపై విమర్శలు రావడంతో కొన్ని సీన్స్ తొలగించారు. ఆ తర్వాత మరిన్ని యాడ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు.

ఇదే విషయంపై ఓటీటీ ప్రియులు క్లారిటీ కోరుతున్నారు. ఓటీటీలో జాన్వీ కపూర్‌ పాత సీన్స్‌తోనే పెద్దిని స్ట్రీమింగ్ చేస్తారా అనే సందేహం ఆడియన్స్‌లో నెలకొంది. లేదంటే కొత్త సీన్స్‌ యాడ్‌ చేసిన పెద్దిని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మేకర్స్ కూడా ఎలాంటి అనౌన్స్ చేయలేదు. ఈ విషయంలో సినీ ‍ప్రియులకు పెద్ది ఓటీటీ వర్షన్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా.. గతంలో రామ్ చరణ్ నటించిన గత సినిమా గేమ్ ఛేంజర్ కూడా ఇలాంటి పరిస్థితే చూసింది. థియేటర్స్ లో మొదట వచ్చినా వర్షన్‌ తర్వాత కొన్ని సీన్స్ తీసేసి నానా హైరానా సాంగ్ పెట్టి తగ్గించేశారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఆ సీన్స్ ఏవీ కూడా అందులో లేవు. అలాగే పెద్ది సినిమాకి కూడా ఇలానే జరుగుతుందా? అని ప్రేక్షకులు భావిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement