‘ఐ విల్ ఫైండ్ యూ’ రివ్యూ : సూపర్ థ్రిల్లింగ్ సిరీస్ | I Will Find You Web Series Review In Telugu | Sakshi
Sakshi News home page

‘ఐ విల్ ఫైండ్ యూ’ రివ్యూ : సూపర్ థ్రిల్లింగ్ సిరీస్

Jun 30 2026 12:55 PM | Updated on Jun 30 2026 1:10 PM

I Will Find You Web Series Review In Telugu

ప్రేమానుబంధమనేది మమతానురాగాలతో పెనువేసుకున్న ఓ చిక్కుబంధం. అందులోనూ రక్తసంబంధం అనేది మరింత జటిలమైనది. తామ రక్తసంబంధం ఏ సమయంలోనైనా సరే దూరమైతే ఆ బాధ వర్ణణాతీతం. మళ్ళీ దూరమైన వారితో కలిస్తేనే తమ జీవితానికి అర్ధం అని అనుకునేవారెందరో.  ఆ నేపధ్యంతోనే హాలివుడ్ రచయిత హర్లాన్ కోబన్ రాసిన కథే  ఐ విల్ ఫైండ్ యూ. ఇప్పుడీ కథను నెట్ ఫ్లిక్స్  8 ఎపిసోడ్ల్ సిరీస్ రూపంలో తీసుకువచ్చింది. 

కొడుకు హత్యారోపణను ఎదుర్కుంటున్న ఓ తండ్రి చనిపోయిన తన కొడుకును వెతుకుతూ సాగించిన పోరాటమే ఈ ఐ విల్ ఫైండ్ యూ సిరీస్. డేవిడ్ బరోస్ తన కొడుకు మాథ్యూ బరోస్ ను చంపిన కేసులో కౌంటీ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. మాధ్యూ బరోస్ తల్లి ఛెరిల్ చెల్లెలైన రేచెల్ మిల్స్ తన బావ డేవిడ్ బరోస్ ను చూడడానికి జైలుకు వస్తుంది. ఆ సమయంలోనే రేచేల్ మాథ్యూ చనిపోలేదని ఓ ఫోటో డేవిడ్ కు చూపుతుంది. తన కొడుకు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలుసుకున్న డేవిడ్, రేచెల్ సహాయంతో జైలు నుండి తప్పించుకుని మాథ్యూని వెతుకుతూ ఉంటాడు. 

ఈ ప్రయత్నంలోనే రేచెల్ బాయ్ ఫ్రెండ్ అయిన ఆడమ్ ఇంట్లో డేవిడ్, రేచెల్ తలదాచుకుంటారు. ఇక అక్కడి నుండి కథ అనూహ్యమైన మలుపులతో ఊహ కందని ట్విస్టులతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. చనిపోయిన కొడుకు మాథ్యూ కేసులో నిందితుడైన డేవిడ్ మాథ్యూని రేచెల్ తో కనుక్కోగలడా లేదా అన్నది ఈ థ్రిల్లింగ్ సిరీస్ లోనే చూడాలి. 8 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం చూస్తున్న ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తూ థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఎవరూ ఊహించని సస్పెన్స్ తో సాగే ఈ సిరీస్ థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడే వాళ్ళకి సరైన ఛాయిస్.
 – హరికృష్ణ ఇంటూరు  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement