ఓటీటీకి టాలీవుడ్ ఎమోషనల్ డ్రామా..స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Tollywood Movie Ramani Kalyanam Streaming Date out now | Sakshi
Sakshi News home page

మూడు వారాల్లోనే ఓటీటీకి తెలుగు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jun 7 2026 5:14 PM | Updated on Jun 7 2026 6:01 PM

Tollywood Movie Ramani Kalyanam Streaming Date out now

సూర్య వశిష్ట, దీప్షిక హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఎమోషనల్ డ్రామా రమణి కల్యాణం. ఈ ఎమోషనల్ డ్రామాకు  విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. మే 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.  చిత్రాన్ని కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మించారు.

ఈ సినిమా ఓటీటీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. సన్ నెక్ట్స్ వేదికగా ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈనెల 12 నుంచే సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ పంచుకున్నారు.

ఈ సినిమా కథేంటంటే.. 

సంజన(దీప్షిక) చిన్నప్పుడే ఓ యాక్సిడెంట్ లో కళ్ళు పోగొట్టుకున్నా తన పనులు తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉంటూ ఓ పబ్ లో సింగర్ గా పనిచేస్తూ ఉంటుంది. నలుగురు పిల్లలు, ఓ బామ్మ.. వాళ్లే సంజన ప్రపంచం. సంజన పనిచేసే పబ్ ఓనర్ కిషోర్(శ్రీనివాసరెడ్డి) ఫ్రెండ్ రాజ్(సూర్య వసిష్ఠ) నడవలేడు. పక్షవాతం వల్ల వీల్ చైర్ కే అంకితం. అనుకోకుండా ఈ ఇద్దరూ ఓ గొడవతో పబ్ లో కలిసి స్నేహితులుగా మారి అనంతరం ప్రేమలో పడతారు. ఎప్పుడూ అతని గతం, గోల్ గుర్తుచేసుకుంటూ బాధపడే రాజ్ సంజన ప్రేమతో పూర్తిగా మారిపోయి సంతోషంగా ఉంటాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే కిషోర్ కి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? మరి సంజన - రాజ్ ల పెళ్లి జరిగిందా? అసలు రాజ్ ఎందుకు వీల్ చైర్ కే పరిమితమయ్యాడు? రాజ్ గతమేంటి? సంజన గతం ఏంటి? సంజనతో ఉండే నలుగురు పిల్లలు ఎవరు? కిషోర్‌కి రాజ్ గురించి ఏం తెలిసింది అన్నదే ఈ సినిమా కథ.

 

Advertisement
 
Advertisement
Advertisement