ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్.. ఈసారి ఇంకాస్త | Sshhh Season 3 OTT Streaming Update Latest | Sakshi
Sakshi News home page

Sshhh 3 OTT: ఈసారి మరింత బోల్డ్‌గా.. ఓటీటీ స్ట్రీమింగ్ ఫిక్స్

Jun 5 2026 10:53 AM | Updated on Jun 5 2026 11:15 AM

Sshhh Season 3 OTT Streaming Update Latest

ఓటీటీలకు సెన్సార్ ఉండదు. కాబట్టి బూతు, రొమాంటిక్ జానర్ సినిమాలు, సిరీస్‌లు అప్పుడప్పుడు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు అలానే బోల్డ్ రొమాంటిక్ కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగానూ ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: 'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?)

2024లో 'ష్' పేరుతో తమిళంలో ఓ సిరీస్ తీశారు. సోనియా అగర్వాల్, ఇనయా, ఐశ్వర్య దత్తా తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. దీని గతేడాది తెలుగులోనూ డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తర్వాత కొన్నిరోజులకే రెండో సీజన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో కొత్త పాత్రలు కొత్త కాన్సెప్ట్ చూపించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మూడో సీజన్ కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈసారి మరింత బోల్డ్ కంటెంట్ ఉండబోతుందన్నట్లు హింట్ ఇచ్చారు.

జూన్ 12 నుంచి అంటే వచ్చే శుక్రవారం నుంచి 'ష్ సీజన్ 3' ఆహా ఓటీటీలో తెలుగు, తమిళంలో అందుబాటులోకి రానుంది. ఈ సీజన్‌లో ఒకప్పటి హీరోయిన్ పూనమ్ బజ్వా, బిగ్‌బాస్ ఫేమ్ దివి, కిరణ్ రాథోడ్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. వీళ్లంతా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు, వీడియోలతో ఇప్పటికే ఫేమస్.  

(ఇదీ చదవండి: మొన్న 'దేవర'.. ఇప్పుడు 'పెద్ది'.. జాన్వీ కపూర్‌ అదే తంతు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement