బాలకృష్ణకు గాయం.. ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ట్వీట్‌ | Jr NTR, Kalyan Ram Response On Balakrishna Recent Injury | Sakshi
Sakshi News home page

బాలకృష్ణకు గాయం.. ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ట్వీట్‌

Jul 21 2026 4:20 PM | Updated on Jul 21 2026 4:35 PM

Jr NTR, Kalyan Ram Response On Balakrishna Recent Injury

సినిమా షూటింగ్‌లో గాయపడ్డ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరోలు ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌లో వేరు వేరుగా పోస్టులు పెట్టారు. ‘బాలా బాబాయ్‌ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు’అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశాడు. 

‘బాయ్‌ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నా’ అని కల్యాణ్‌ రామ్‌ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు. 

కాగా, #NBK111(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడ్డాడు.గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కాకినాడ పోర్ట్‌లో జరుగుతోంది.  అక్కడ మంచు మనోజ్‌, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో టీమ్.. బాలకృష్ణని ఆస్పత్రికి తరలించారు. మోకాలికి గాయమైననట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాకినాడ పోర్ట్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement