హీరోయిన్‌తో శృంగార సన్నివేశం..పదే పదే థ్యాంక్స్‌ చెప్పిన హీరో! | Seth Rogen Reveals He Could Not Stop Thanking Penelope Cruz During Shoot Of This Scene | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్‌.. భర్తను చూసి భయపడిపోయిన హీరో!

Jul 21 2026 6:02 PM | Updated on Jul 21 2026 6:38 PM

Seth Rogen Reveals He Could Not Stop Thanking Penelope Cruz During Shoot Of This Scene

హాలీవుడ్ ప్రముఖ నటుడు సేథ్ రోజెన్, స్పానిష్ సూపర్‌స్టార్ పెనెలోప్ క్రూజ్ కాంబినేషన్‌లో 'ది ఇన్వైట్' (The Invite) అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ టాక్‌ షోలో పాల్గొన్న సేథ్ రోజెన్ షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ కామెడీ విషయాన్ని షేర్‌ చేసుకున్నాడు. ఈ సినిమాలో పెనెలోప్‌తో ఓ శృంగార  సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు పదే పదే థ్యాంక్స్‌ చెప్పాడట.

 అది భయంతోనో లేదా ఉత్సాహంతోనో తెలియదు కానీ ఆమెను అలా చూడగానే థ్యాంక్స్‌ చెప్పేయాలనిపించిందని సేథ్‌ చెప్పాడు. ‘నేను పదే పదే థ్యాంక్స్‌ చేప్పడంతో డైరెక్టర్‌ ఆలివియా సీరియస్‌ అయ్యారు. షూటింగ్‌ ఆపి.. ‘అసలు ఏం చేస్తున్నావ్ సేథ్? ఆమెకు అన్నిసార్లు 'థ్యాంక్యూ' అని ఎందుకు చెబుతున్నావ్?’ అని ఆశ్చర్యంగా అడిగారు.  దానికి నేను నవ్వుతూ.. ‘నాకేం తెలీదు, నా నోటి నుంచి ఆ మాటలే వస్తున్నాయి. నిజ జీవితంలో పెనెలోప్ క్రూజ్ లాంటి బ్యూటీతో అంత దగ్గరగా ఉండే అవకాశం వస్తే కృతజ్ఞత తప్ప ఇంకేం చూపిస్తాం’ అని బదులు ఇచ్చానని సేథ్‌ చెప్పుకొచ్చాడు.

ఆమె భర్త గుర్తొచ్చి భయపడ్డా..
ఇదే టాక్‌ షోలో  పెనెలోప్ క్రూజ్ భర్త, ఆస్కార్ విజేత అయిన ప్రముఖ హాలీవుడ్ నటుడు హావియర్ బార్డెమ్ (Javier Bardem) గురించి కూడా సేథ్ రోజెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  క్రూజ్‌తో రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె భర్త హావియర్ బార్డెమ్ ఎలా స్పందిస్తారోనని మనసులో కాస్త భయం, కంగారు ఉండేదని చెప్పాడు.అయితే వెంటనే నవ్వుతూ.. ‘హావియర్ నన్ను చూసి ఏమాత్రం భయపడడు. నన్ను ఒక పోటీదారుడిగా ఆయన అస్సలు భావించడని నాకు తెలుసు’ అని కామెడీ టచ్ ఇచ్చారు.  

రొమాంటిక్‌ సీన్‌లో గాయం
రొమాంటిక్ సన్నివేశం షూటింగ్ సమయంలో సరదాగా కింద పడాల్సిన ఒక షాట్‌లో సేథ్ నిజంగానే కిందపడి, తన భుజానికి తీవ్ర గాయమైందని, ఆ నొప్పి నుంచి కోలుకోవడానికి దాదాపు 7 నెలల సమయం పట్టిందని సేథ్ రోజెన్ వివరించారు.  ఒకే సన్నివేశంలో భయం, కంగారు, గాయం.. ఇలా అన్ని అనుభవాలు కలగడం తన జీవితంలో మరిచిపోలేనని ఆయన నవ్వుతూ ఆ ఇంటర్వ్యూలో ముగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement