ది రాజాసాబ్‌ మేకర్స్ చేతికి స్పిరిట్.. అందుకేనా?? | The Raja Saab Banner Bags Karnataka Rights of Prabhas Spirit Movie | Sakshi
Sakshi News home page

Prabhas: ది రాజాసాబ్‌ మేకర్స్ చేతికి స్పిరిట్.. అందుకేనా??

Jul 21 2026 4:56 PM | Updated on Jul 21 2026 5:12 PM

The Raja Saab Banner Bags Karnataka Rights of Prabhas Spirit Movie

రెబల్‌ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. గతేడాది మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ హారర్ కామెడీ చిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ది రాజాసాబ్ మేకర్స్‌కు బిగ్ డీల్ కుదిరింది. ది రాజాసాబ్‌ నష్టాన్ని కొంచమన్నా తగ్గించుకోవడానికి అవకాశం ఇచ్చారు. రెబల్ స్టార్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ స్పిరిట్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ది రాజాసాబ్ మేకర్స్‌కు అప్పగించారు. 'స్పిరిట్' చిత్రానికి సంబంధించిన కర్ణాటక థియేట్రికల్ పంపిణీ హక్కులను పొందినట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ది రాజాసాబ్‌తో నష్టపోయిన నిర్మాతను ఆదుకునేందుకే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని తెలుస్తోంది.

కాగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ మూవీని పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని సందీప్ రెడ్డి వంగా ఇటీవలే వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా.. త్రిప్తీ దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తోన్న స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement