ఓటీటీలో స్పోర్ట్స్ థ్రిల్లర్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Kollywood SPORTS THRILLER web series Ott Streaming Date out now | Sakshi
Sakshi News home page

Ott Thriller Series: ఓటీటీకి స్పోర్ట్స్ థ్రిల్లర్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jun 1 2026 9:02 PM | Updated on Jun 1 2026 9:04 PM

Kollywood SPORTS THRILLER web series Ott Streaming Date out now

ఓటీటీలు వచ్చాక సినిమాలకు కొదవే లేకుండా పోయింది. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా ఏ భాష అయినా సరే తెగ చూసేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి. కంటెంట్ పరంగా మలయాళ చిత్రాలకు దీటుగా కోలీవుడ్‌ కూడా సిద్ధమవుతోంది. తాజాగా ఓ తమిళ సిరీస్‌ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయిపోయింది.

కతిర్, గెలాక్సీ స్టార్ విమల్, దివ్య భారతి, పూర్ణిమ రవి ప్రధాన పాత్రల్లో వస్తోన్న స్పోర్ట్స్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ఈ సిరీస్‌ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. జియో హాట్‌స్టార్ వేదికగా జూన్ 26 నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్‌ సిరీస్‌కు ప్రశాంత్ పాండియరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ కబడ్డీ నేపథ్యంలో సాగనుంది. పోస్టర్స్, టీజర్ చూస్తుంటే గ్యాంగ్‌స్టర్‌ కథగా ఉండనుందని అర్థమవుతోంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్ సినిమాల్లో లాగా.. ఇందులో కతిర్ పాత్ర ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement