ఓటీటీకి వచ్చేసిన డిటెక్టివ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Hollywood Movie THE SHEEP DETECTIVES Streaming On this Ott | Sakshi
Sakshi News home page

ఓటీటీకి హాలీవుడ్ డిటెక్టివ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jun 24 2026 7:53 PM | Updated on Jun 24 2026 8:48 PM

Hollywood Movie THE SHEEP DETECTIVES Streaming On this Ott

ఓటీటీలు వచ్చాక వినోదం మరింత సులభతరం అయిపోయింది. ఏ భాషలో రిలీజైన సరే కంటెంట్ బాగుంటే చాలు డబ్బింగ్ వర్షన్‌లోనూ తెగ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రియులు సినిమాలను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారంలో కొత్త సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ మిస్టరీ కామెడీ మూవీ సడన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 

ప్రముఖ హాలీవుడ్ స్టార్ స్టార్ హ్యూ జాక్మాన్ ప్రధాన పాత్రలో వచ్చిన మిస్టరీ కామెడీ చిత్రం ‘ది షీప్ డిటెక్టివ్స్’. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా జూన్ 24 నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ రచయిత లియోనీ స్వాన్ రాసిన త్రీ బ్యాగ్స్ ఫుల్ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.  ఈ చిత్రానికి కైల్ బాల్డా దర్శకత్వం వహించారు.

ఈ మూవీ కథేంటంటే..

డెన్‌బ్రూక్ అనే చిన్న పట్టణంలో గొర్రెల కాపరిగా పనిచేసే హ్యూ జాక్మాన్ అనుకోని పరిస్థితుల్లో హత్యకు గురవుతాడు. అయితే, ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే కోణంలో కథ ఉండనుంది. దీని కోసం ఆయన మందలోని గొర్రెలే రంగంలోకి దిగడం ఈ చిత్రంలో హైలెట్. గొర్రెలు తమ యజమాని మరణానికి కారణమైన వారిని ఎలా వెతికి పట్టుకున్నాయనేదే ది షీప్ డిటెక్టివ్స్ స్టోరీ. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని ఓటీటీలో చూసేయండి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement