ఓటీటీకి వచ్చేసిన దృశ్యం-3.. తెలుగు వర్షన్‌లో బిగ్‌ ట్విస్ట్‌..! | Mohanlal L Movie Drishyam 3 Telugu Dubbing Version Released In OTT, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Drishyam 3 OTT Release: ఓటీటీలో దృశ్యం-3.. తెలుగు వర్షన్‌లో బిగ్‌ ట్విస్ట్‌..!

Jun 18 2026 7:57 AM | Updated on Jun 18 2026 9:16 AM

Mohanlal latest Movie Drishyam 3 Ott Streaming in Telugu dubbing version

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ నటించిన లేటేస్ట్‌ మూవీ దృశ్యం-3. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం మే 21 థియేటర్లలో రిలీజైంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే రెండో బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా ఘనత సాధించింది.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. జూన్ 18 అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మొదట ఈ సినిమా తెలుగు వర్షన్ అందుబాటులో ఉండడం లేదంటూ వార్తలొచ్చాయి. కానీ అలా ఏం జరగలేదు. ఈ విషయంలో అభిమానులకు ఓటీటీ సంస్థ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మలయాళంతో పాటు తమిళం, కన్నడ, తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవాళ్లు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.

దృశ్యం-3 కథేంటంటే..

దృశ్యం 2 ముగింపు సీన్‌తో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. వరుణ్‌ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు జార్జ్‌కుట్టి(మోహన్‌లాల్‌) వేసిన ప్లాన్‌ సక్సెస్‌ అవుతుంది. కోర్టు ఆదేశాలతో జార్జ్‌ ఫ్యామిలీపై ఎలాంటి కేసు నమోదు కాకుండా బయటపడతారు. తన జీవితంలో చోటు చేసుకున్న ఈ ఘటననే కాస్త మార్పులు చేసి ఓ సినిమాను నిర్మిస్తాడు జార్జ్‌. అది రిలీజై..బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అవుతుంది. అదే సమయంలో మానసిన సమస్యలను నుంచి బయటపడిన పెద్ద కూతురు అంజుకి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. భార్య రాణి(మీనా) కూడా కూతురికి త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. అయితే చాలా సంబంధాలు వచ్చినప్పటికీ.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంజు గురించి నెగెటివ్‌గా చెప్పడంతో అవన్నీ తప్పిపోతాయి.

కొన్నాళ్ల తర్వాత తన కూతురికి వచ్చిన పెళ్లి సంబంధాలను ఇద్దరు చెడగొడుతున్నారనే విషయం తెలుస్తుంది? అసలు ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నారు? కొడుకు(వరుణ్‌)ని పోగోట్టుకున్న బాధ నుంచి బయటపడేందుకు అమెరికా వెళ్లిన గీతా ప్రభాకర్‌, ప్రభాకర్‌ మళ్లీ జార్జ్‌ లైఫ్‌లోకి ఎందుకు వచ్చారు? సస్పెండ్‌ అయిన పోలీసు ఆఫీసర్‌ సహదేవన్‌ చేసిన కుట్ర ఏంటి?  వరుణ్‌ హత్య కేసు నుంచి కూతురిని తప్పించేందుకు ఈ సారి జార్జ్‌ వేసిన ప్లాన్‌ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement