చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. పెద్ది థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజయ్యాయి. వాటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేటర్ల వద్ద హడావుడి కనిపించడం లేదు. ఈ వారంలో థియేటర్లలో దీవానా, మా ఇంటి బంగారం లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో సమంత మా ఇంటి బంగారంపై కాస్తా బజ్ నెలకొంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీల వైపే చూస్తున్నారు.
ఈ వారంలో ఓటీటీ ప్రియులను అలరించేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. దృశ్యం-3, కెనతా కానోమ్, ఎం4ఎం లాంటి సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మోహన్ లాల్ దృశ్యం-3 కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారంలో ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ఐ విల్ ఫైండ్ యూ(హాలీవుడ్ సినిమా)- జూన్ 18
వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసబెల్లె(హాలీవుడ్ సినిమా)- జూన్ 19
తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 19
హస్బెండ్స్ ఇన్ యాక్షన్(కొరియన్ మూవీ)- జూన్ 19
జియో హాట్‌స్టార్
కెనతా కానోమ్(తమిళ సినిమా)- జూన్ 16
అమెజాన్ ప్రైమ్
యువర్ ఫాల్ట్(హాలీవుడ్ మూవీ)- జూన్ 17
దృశ్యం-3-(మలయాళ మూవీ)- జూన్ 18
ది ఎజెన్సీ- సీజన్-2(వెబ్ సిరీస్)- జూన్ 21
లయన్స్ గేట్ ప్లే..
అలియా బసు గాయబ్ హై(బాలీవుడ్ మూవీ)- జూన్ 19
ఎం4ఎం(మోటివ్ ఫర్ మర్డర్)-(తెలుగు సినిమా)- జూన్ 19
సోని లివ్..
అతిరథి(మలయాళ సినిమా)- జూన్ 19


