breaking news
lower berths
-
లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో
రైలు ప్రయాణంలో గర్భిణీలు, సీనియర్ సిటిజన్లు ఉన్నపుడు వారికి లోయర్ బెర్త్ కావాలని ఆశపడతాం. కానీ లోయర్ బెర్త్ దొరుకుతుందా అనేది నమ్మకం ఉండదు. లోయర్ బార్త్ రాక, మిడిల్, అప్పర్ బెర్త్ ఎక్కలేక, పక్క వాళ్లని రిక్వెస్ట్ చేసుకుంటూ చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్లకి నిజంగా ఇది చాలా సమస్య.అయితే లోయర్ బెర్త్ కావాలంటే సీనియర్ సిటిజన్లు ఈ తప్పు చేయకండి అంటూ టికెట్ ఎగ్జామినర్ (TTE) చెప్పిన చిట్కా ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.సీనియర్ సిటిజన్ కోటా కింద సీట్ల కేటాయింపునకు సంబంధించి ఈ వైరల్ వీడియో ప్రశంసలందుకుంటోంది.తమకు లోయర్ బెర్త్ రాలేదంటూ కొందరు ప్రయాణికులు సీనియర్ సిటిజన్లు టికెట్ చెకింగ్‌కు వచ్చిన టీటీఈకి చెప్పుకున్నారు. అపుడు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ తప్పు చేయకండి అంటూ ఆయన ఏం చెప్పారంటే.."మీరు సీనియర్ సిటిజన్ కోటాను పొందాలనుకుంటే, అదీ లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి. అప్పుడు బుక్ చేసిన ఇద్దరికీ లోయర్ బెర్త్ వస్తుంది, లేదా ఇద్దరిలో ఒకరికైనా లోయర్ బెర్త్ వస్తుంది. అలా కాకుండా ఒకే టికెట్లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చుకుంటే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయి అంటూ టీటీసీ అసలు రహస్యాన్ని చెప్పారు. అయితే ఇంకో సమస్య ఏంటంటే.. ఇలా నలుగురు ఇలా బుక్ చేసుకున్నపుడు నలుగురికి ఒకే చోట, లేదా ఒకే కోచ్‌లో సీట్లు వస్తాయనే గ్యారంటీ లేదు. Important and useful train ticket booking hack... if you are senior citizenKudos to this TTE for calmly explaining this, He deserves a raise @RailwaySeva @AshwiniVaishnaw pic.twitter.com/l5VJwATRKR— Woke Eminent (@WokePandemic) November 10, 2025 ఆగస్టు ప్రారంభంలో ఇలాంటి ప్రశ్నకు ప్రతిస్పందనగా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎక్స్‌లో వివరణ ఇచ్చింది. "లోయర్ బెర్త్/సీనియర్ సిటిజన్ కోటా బెర్త్‌లు 60 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులకు, 45 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుంది. ఒంటరిగా లేదా ఇద్దరు ప్రయాణికులతో (పేర్కొన్న ప్రమాణాల ప్రకారం) ఒకే టికెట్‌పై ప్రయాణించే టప్పుడు. ఇద్దరు కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నా, లేదా ఒకరు సినీయర్ సిటిజన్ కాని వ్యక్తి ఉన్నా కోటా వర్తించదని IRCTC పేర్కొంది.లోయర్ బెర్త్‌లు స్వయంచాలకంగా సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా ప్రయాణీకులకు, లభ్యతకు లోబడి కేటాయించబడతాయి. ప్రతి రైలు కోచ్‌లో, స్లీపర్ క్లాస్‌లో ఆరు నుండి ఏడు లోయర్ బెర్తులు, AC 3-టైర్లో నాలుగు నుండి ఐదు, AC 2-టైర్లో మూడు నుండి నాలుగు సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలుగర్భిణీ స్త్రీలకు రిజర్వ్ చేయబడతాయి.అదనంగా, అన్ని జోనల్ రైల్వేలలోని సబర్బన్ సెక్షన్లలోని మొదటి ,చివరి సెకండ్-క్లాస్ జనరల్ కంపార్ట్మెంట్లలో కనీసం ఏడు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేయబడతాయి.బుకింగ్ సమయంలో వయస్సు రుజువు అవసరం లేనప్పటికీ, ప్రయాణీకులు ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే వయస్సు గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఎందుకంటే చెకింగ్ ఆఫీసర్లు వచ్చినపుడు, వాటిని చూపించాల్సి ఉంటుంది. -
రైలులో లోయర్ బెర్త్.. రైల్వే కొత్త రూల్
దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ప్రయాణీకుని అవసరాలకు తగినట్లుగా భారతీయ రైల్వే సౌకర్యాలు కల్పిస్తోంది. రైళ్లలో లోయర్, మిడిల్, అప్పర్.. ఇలా రకారకాల బెర్తులు ఉంటాయి. అయితే మిడిల్, అప్పర్ బెర్తులకు పెద్ద వయసువారు ఎక్కలేరు.ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా లోయర్ బెర్త్‌ల కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే కుటుంబంలోని సీనియర్ సిటిజన్ల కోసం టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారికి కచ్చితంగా లోయర్ బెర్త్ రావాలంటే రైల్యేవారి కొత్త రూల్స్ పాటించాలి.సీనియర్ సిటిజన్లకు ఉపశమనం కల్పించేందుకు రైల్వే పలు నిబంధనలను రూపొందించింది. ఇది వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్‌లు సులభంగా కేటాయిస్తున్నట్లు ఐఆర్సీటీసీ (IRCTC) పేర్కొంది. కాళ్ల సమస్యలు ఉన్న తన అంకుల్ కోసం రైలు టికెట్ బుక్ చేసి, లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పటికీ రైల్వే మాత్రం ఆయనకు పై బెర్త్ ఇచ్చిందని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు.సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎలా బుక్ చేసుకోవాలి? అంటూ కోరాడు. ప్రయాణికుడి ట్వీట్‌పై రైల్వే స్పందిస్తూ, సాధారణ కోటా కింద టికెట్ బుక్ చేసుకుంటే, సీట్లు అందుబాటులో ఉంటేనే లోయర్ సీట్ల కేటాయింపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రిజర్వేషన్ సెలక్షన్ బుక్ కింద బుక్ చేస్తేనే లోయర్ బెర్త్ లభిస్తుందని స్పష్టం చేసింది.ముందుగా వచ్చిన వారికే ప్రాధాన్యంజనరల్ కోటా కింద బుకింగ్ చేసుకునే వారికి సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లోయర్ బెర్తులు కేటాయిస్తామని రైల్వే తెలిపింది. ఈ సీట్ల కేటాయింపు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందించబడే పద్ధతిలో ఉంటుంది. జనరల్ కోటా బెర్త్ కేటాయింపులో మానవ ప్రమేయం ఉండదు. అయితే మీరు లోయర్ బెర్త్ కోసం టీటీఈ (TTE)ని సంప్రదించవచ్చు. -
రైల్వే రిజర్వేషన్లో కొత్త రూల్! ప్రాధాన్యత వారికే..
రైల్వే రిజర్వేషన్, బెర్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్‌ను అమలు చేసింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే నిబద్ధతను ఈ నిబంధన తెలియజేస్తుంది. పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్‌ల కేటాయించడంపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లను పొందే ప్రక్రియను స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే అందించిన స్పష్టీకరణ ప్రకారం.. ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ ఎంపికను ఎంచుకోవాలి. అయితే బెర్తుల కేటాయింపులు లభ్యతకు లోబడి ఉంటాయి. ముందుగా రిజర్వ్ చేసుకున్నవారికి ముందుగా ప్రాతిపదికన లోయర్ బెర్త్‌లు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. లోయర్ అవసరమైన ప్రయాణికులు రైలు టిక్కెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించవచ్చని, లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
లోయర్ బెర్త్ కావాలంటే... బాదుడే!
న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో సినియర్ సిటిజన్లు, అనారోగ్యంతో ఉన్నవారు, మహిళలు సాధారణంగా కింది బెర్త్ ఎంపికకు ఇష్టపడతారు. ఇలా సౌకర్యవంతంగా ప్రయాణించలనుకున్న రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ గట్టి షాకే ఇవ్వనుంది. లోయర్‌బెర్త్ బుకింగ్‌లపై అదనపు చార్జీల వసూలుకు యోచిస్తోంది. విమానాల్లో విండో సీట్ల కేటాయింపునకు అధిక చార్జీ వసూలు చేసినట్టుగానే రైళ్లలో కూడా లోయర్‌బెర్త్ బుకింగ్‌లపై చార్జీల బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటి బుకింగ్స్‌లో భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో రైల్వే శాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రైల్వే రిజర్వేషన్ సందర్భంగా లోయర్ బెర్త్‌లకు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ బాటలోనే పయనిస్తూ ఈ నిర్ణయం తీసుకోనుంది. కింది బెర్త్ బుకింగ్‌లపై రూ .50 పెంచాలని భారత రైల్వే శాఖ సిఫారసు చేసినట్టు సమాచారం. కాగా ప్రస్తుతం భారతీయ రైల్వేస్ వెబ్సైట్ లో టిక్కెట్లను బుకింగ్ సందర్భంగా బెర్త్‌లను ఎంపిక చేసుకునే ఒక ఆప్షన్‌ను ప్రయాణికులకు అందింస్తున్న సంగతి తెలిసిందే.


