breaking news
pantangi toll plaza
-
హైవేపై వాహనాల రద్దీ.. ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..
సాక్షి, నల్లగొండ: సంక్రాంతి పండుగ ముగిసింది. నగరవాసులు.. ఒక్కొక్కరుగా పల్లెలను వీడుతున్నారు. సిటీ వైపు పరుగు తీశారు. దీంతో, రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో హైవేలపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు.. పటుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేశారు.సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు.. హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో, జాతీయ రహదారి-65పై హైదరాబాదు వైపు వాహనాలు పరుగులు తీస్తున్నాయి. శనివారం ఒక్కరోజే హైదరాబాద్ వైపు లక్షన్నర వాహనాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక, ఏపీ నుంచి వచ్చే భారీ వాహనాలను కోదాడ నుంచి హుజూర్నగర్, మిర్యాలగూడ, హాలియా, మల్లేపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ డైవర్షన్ చేశారు. మరికొన్ని వాహనాలను టోల్ ఫ్లాజాల వద్ద నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఉన్నట్టు వాహనదారులకు సూచిస్తున్నారు. -
దద్దరిల్లిన పంతంగి టోల్‌ప్లాజా.. మరో రికార్డు!
సాక్షి, యాదాద్రి: సంక్రాంతి నేపథ్యంలో చౌటుప్పల్ (మం) పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈసారి సంక్రాంతికి నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ టూ విజయవాడ నేషనల్ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లినట్టు టోల్ సిబ్బంది చెబుతున్నారు.మరోవైపు.. కొందరు పోకిరీలు టోల్ ప్లాజాల వద్ద విచ్చలవిడిగా అత్యవరస సైరన్స్(పోలీస్, అంబులెన్స్) దుర్వినియోగం చేస్తున్నారు. సైరన్‌తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు కొందరు పోకిరీలు ఇలా సైరన్ మోగిస్తూ హంగామా చేస్తున్నట్టు టోల్ సిబ్బంది గుర్తించారు. వీఐపీల్లా బిల్డప్ ఇస్తూ టోల్ ప్లాజా నిర్వాహకులకు టోకరా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరన్ చప్పుడుతో మిగతా వాహనదారులను హడలెత్తిస్తున్నారు.మూడు రోజులుగా సైరన్లతో పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్లను దాటుకుంటూ వందలాది వాహనాలు వెళ్లినట్టు సిబ్బంది చెబుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే బామ్మర్దిని, మంత్రి గారి బంధువును అంటూ ఫేక్ వీఐపీలు టోల్ సిబ్బందిని బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో, పోకిరీల సైరన్స్ పోలీసులకు సవాల్‌గా మారాయి. -
టోల్ ప్లాజా నిర్లక్ష్యం.. ప్రమాదాలకు దారి
-
టోల్‌ప్లాజాల వద్ద కొనసాగుతున్న రద్దీ.. వాహనదారుల ఆగ్రహం!
సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి ఇప్పటికే లక్షలాదిగా పట్నంవాసులు ఏపీకి తరలి వెళ్లారు. ఇవాళ రాత్రి వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. లక్షలాదిగా వాహనాలు ఏపీ వైపు వెళ్లడంతో టోల్ ప్లాజా నిర్వాహకులకు సైతం భారీగా ఆదాయం వస్తోంది. మరోవైపు.. ఆదాయం వస్తున్నా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు. -
సంక్రాంతికి పల్లె బాట.. ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్‌తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్..హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్, హైకోర్టు, ఆఫ్జల్‌గంజ్, నయాపూల్ భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వీకెండ్ సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్ కారణంగా రద్దీ నెలకొంది.విజయవాడలో..పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. -
సంక్రాంతి ఎఫెక్ట్.. పంతంగి, కూకట్‌పల్లిలో ఫుల్ ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. రేపటి నుంచే విద్యా సంస్థలకు సెలవులు కావడంతో సిటీ జనం.. పల్లెబాట పట్టారు. సొంతూరికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో.. బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో బయలుదేరుతున్నారు.దీంతో, కూకట్పల్లి-మియాపూర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్, కార్లతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు. మరోవైపు.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడింది. #Nalgonda In view of the Sankranti festival rush, traffic congestion has increased significantly on the Hyderabad-Vijayawada National Highway (NH-65). Specifically, there is a heavy influx of vehicles at the Pantangi Toll Plaza.@NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE pic.twitter.com/lFCYHMMhDD— Akalankam Seshu (@ienalgonda) January 9, 2026 -
హైదరాబాద్-విజయవాడ హైవే.. తగ్గిన టోల్ ఛార్జీలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు శుభవార్త. ఈ మార్గంలో వెళ్లే వాహనాలకు టోల్ చార్జీలను తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ(NHAI) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి (31 అర్ధరాత్రి) నుంచి అమలులోకి రానున్నాయి.ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ చార్జీలను తగ్గించింది. తగ్గిన చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ 2025 నుంచి మార్చి 31వ తేదీ 2026 వరకు అమలులో ఉండనున్నాయి. ఇక, హైదరాబాద్-విజయవాడ (65) జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి.ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, లైట్ వేయిట్ వాహనాలను ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25 శాతం మినహాయింపు లభిస్తుంది. గతంలో ప్రతీ ఏప్రిల్ 1న టోల్ చార్జీలు పెంచిన జీఎంఆర్. 2024 జూన్ 31తో జీఎంఆర్ ఒప్పందం ముగిసింది. అయితే, హైవే-65ను బీవోటీ పద్ధతిలో నిర్మించడంతో 2012 డిసెంబర్ నుంచి టోల్ వసూలు చేసిన జీఎంఆర్. ఒప్పందం 2024లో ముగియడంతో ఏడాది పాటు నిర్వాహణను ఏజెన్సీలకు అప్పగించిన ఎన్హెచ్ఏఐ. దీంతో, తాజాగా ఎన్హెచ్ఏఐ టోల్ నిర్వహణను చేపడుతుండటంతో ఛార్జీలు తగ్గాయి. టోల్ తగ్గించడంతో వాహనదారులకు ఊరట లభించనుంది. -
సిటీకి తిరుగు ప్రయాణం.. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ జామ్!
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ ముగిసింది. దీంతో, సిటీ నుంచి గ్రామాలకు వెళ్లినవారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి సొంతూరుకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు వస్తుండటంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వరుసకట్టాయి. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఎల్బీనగర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ, నల్గొండ, ఖమ్మం, నార్కట్‌పల్లి, కోదాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాలు వస్తున్నాయి. ఇటు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి కూడా భారీగా వాహనాలు వస్తుండటంతో నగర శివారులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
దసరా ఎఫెక్ట్: పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌జామ్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: దసరా పండుగ సొంతూళ్లలో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు గ్రామాల బాట పట్టారు. చాలా మంది తమ సొంత కార్లలోనే ఊళ్లకు పయనమయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోపక్క దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు -
చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం
చౌటుప్పల్: సంక్రాంతి సెలవులు ముగిశాయి. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారు అందరూ హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో వారు ప్రయాణిస్తున్న వాహనాలతో యాదాద్రి భువనగిరిజిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. -
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వేల సంఖ్యలో వెళ్తున్న వాహనాలతో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై నల్గొండజిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్ను చెల్లించేందుకు వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగడంతో రద్దీ చాలా పెరిగిపోతుందని వాహనదారులు చెబుతున్నారు. ఒకవైపు సొంత వాహనాలున్న వారు, మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య నేడు అధికంగా ఉంది. నేడు భోగి పండుగ కాగా, రేపు (శనివారం) మకర సంక్రాంతిని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ఇళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నగరం ఖాళీ అవుతుంటే.. పండక్కి గ్రామాలకు వెళ్లేవారితో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. -
సంక్రాంతి ఎఫెక్ట్, భారీగా ట్రాఫిక్ జాం
-
సంక్రాంతి ఎఫెక్ట్, భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంక్రాంతి పండగ పురస్కరించుకుని హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాల్లో బయలుదేరారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి వాహనాల రాకపోకలతో మరింత రద్దీ పెరిగింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పన్ను చెల్లించేందుకు వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నకిరేకల్ సమీపంలోని కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


