సంక్రాంతి ఎఫెక్ట్‌, భారీగా ట్రాఫిక్‌ జాం | Traffic Jam in Hyderabad Vijayawada to road | Sakshi
Sakshi News home page

సంక్రాంతి ఎఫెక్ట్‌, భారీగా ట్రాఫిక్‌ జాం

Jan 12 2017 9:59 AM | Updated on Sep 5 2017 1:06 AM

సంక్రాంతి ఎఫెక్ట్‌, భారీగా ట్రాఫిక్‌ జాం

సంక్రాంతి ఎఫెక్ట్‌, భారీగా ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జాం అయింది.

హైదరాబాద్‌:  హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. సంక్రాంతి పండగ పురస్కరించుకుని హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు చేరుకునేందుకు వాహనాల్లో బయలుదేరారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి వాహనాల రాకపోకలతో మరింత రద్దీ పెరిగింది.  నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పన్ను చెల్లించేందుకు వాహనాలు నిలపడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

దీంతో విజయవాడ  నుంచి  హైదరాబాద్ వైపు అలాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు బారులు తీరాయి.  జాతీయ రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నకిరేకల్‌ సమీపంలోని కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement