సాక్షి, నల్లగొండ: సంక్రాంతి పండుగ ముగిసింది. నగరవాసులు.. ఒక్కొక్కరుగా పల్లెలను వీడుతున్నారు. సిటీ వైపు పరుగు తీశారు. దీంతో, రహదారులపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో హైవేలపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు.. పటుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేశారు.
సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు.. హైదరాబాద్‌కు వస్తున్నారు. దీంతో, జాతీయ రహదారి-65పై హైదరాబాదు వైపు వాహనాలు పరుగులు తీస్తున్నాయి. శనివారం ఒక్కరోజే హైదరాబాద్ వైపు లక్షన్నర వాహనాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక, ఏపీ నుంచి వచ్చే భారీ వాహనాలను కోదాడ నుంచి హుజూర్‌నగర్, మిర్యాలగూడ, హాలియా, మల్లేపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ డైవర్షన్ చేశారు. మరికొన్ని వాహనాలను టోల్ ఫ్లాజాల వద్ద నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఉన్నట్టు వాహనదారులకు సూచిస్తున్నారు.


