వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సొంత పార్లమెంటరీ నియో జకవర్గం వారణాసికి చేరుకుంటారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో ఇక్కడికి రానున్న ఆయన.. బీహెచ్‌ఈఎల్ యూనిట్‌ను సందర్శిస్తారు.
ఈ సందర్భంగా వారణాసికి చెందిన 3,200 మంది ప్రముఖులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. బనారస్ రైల్వేస్టేషన్‌ను సందర్శిస్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు. ఇందులో బనారస్–ఖజురహో, లక్నో– సహరాన్‌పూర్, ఫిరోజ్‌పూర్–ఢిల్లీ, ఎర్నాకులం–బెంగళూరు ఉన్నాయి.


