
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich dad Poor dad) రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ద్రవ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి పెట్టుబడుల పెరుగుదల అనేది వ్యవస్థల వైఫల్యానికి సంకేతమని అని ఆయన హెచ్చరించారు. అమెరికా బేబీ బూమర్ (1946-1964 మధ్య పుట్టినవారు)తరగతికి ఈ ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపించబోతుందని ఆయన భావిస్తున్నారు.
"ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు" అంటూ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. "కానీ ద్రవ్యోల్బణం పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది." ధరలు పెరుగుతున్నప్పుడు, ఫియట్ మనీ లేదా "నకిలీ డబ్బు" సామాన్య అమెరికన్ల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం వంటి "నిజమైన డబ్బు" లో ఆదా చేయాలని ప్రజలకు సూచించారు.
అక్టోబర్ లో బంగారం ధరలో జరిగిన నాటకీయ ర్యాలీని అనుసరించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం, బంగారం ప్రపంచవ్యాప్తంగా ఔన్సుకు 4,250 డాలర్లు, భారతదేశంలో 10 గ్రాములకు రూ.1.31 లక్షల వద్ద (అక్టోబర్ 18 నాటికి) ట్రేడ్ అవుతోంది. వెండి కూడా దూసుకెళ్తోంది. అయితే బిట్ కాయిన్ మార్కెట్ గందరగోళం మధ్య 1,21,000 డాలర్ల నుండి 108,000 డాలర్లకు పడిపోయింది.
1947 లో జన్మించిన రాబర్ట్ కియోసాకి, తన లాంటి బేబీ బూమర్ తరగతికి ఈ ద్రవ్యోల్బణం బలమైన హానిని కలిగించే అవకాశం ఉందని చెప్పారు. "ద్రవ్యోల్బణం ద్వారా మనం పూర్తిగా తుడిచిపెట్టకుపోతామని" ఆయన హెచ్చరించారు. "మీ అమ్మ, నాన్నలు వీధుల్లోకి రావచ్చు ఎందుకంటే ద్రవ్యోల్బణం వారి సామాజిక భద్రతను తుడిచిపెట్టబోతోంది." అన్నారు.
THE RICH get RICHER: while I am personally happy gold, silver, Bitcoin, Ethereum are going up…. My concern is the price of life…. AKA…inflation….makes life harder on the poor and middle class.
Please do your best to not be a victim of a broken and corrupt monetary system.…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 17, 2025