నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న బంగారం: ఎందుకిలా.. | Gold Price Hike Continues | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న బంగారం: ఎందుకిలా..

May 22 2025 8:36 PM | Updated on May 22 2025 8:43 PM

Gold Price Hike Continues

భారతదేశంలో బంగారం ధరలు మళ్ళీ లక్ష రూపాయల ధర వద్దకు చేరువకు చేరుతున్నాయి. మే మొదటి వారం తరువాత తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేటు.. మళ్ళీ దూసుకెళ్తోంది. గురువారం గోల్డ్ మార్కెట్‌లో ట్రేడింగ్ కొనసాగింది. దీంతో ధరలు మళ్ళీ పైపైకి పయనించాయి. ఈ సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ నష్టాలను చవిచూశాయి.

స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తున్న సమయంలో.. బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో రెండు రోజుల్లో 10 గ్రాముల పసిడి ధర సుమారు 300 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు దాదాపు రూ. 98,000 వద్దకు చేరింది. ఇదిలా కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో.. తులం బంగారం లక్ష రూపాయలకు చేరుకుంటుండటంలో ఎటువంటి సందేహం లేదు.

స్టాక్ మార్కెట్లు డీలా పడుతుండటంతో.. పెట్టుబడిదారులు బంగారం కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఇంతుకు ముందు ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు కొంత అనుకూలంగా ఉన్నట్లే అని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

బంగారం ఎప్పుడూ భద్రమైన ఆస్తి, కాబట్టి పసిడి కొనుగోలు చేయడానికే ఆసతి చూపండి అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే ఉన్నారు. బంగారం కొనుగోలు చేస్తే.. పేదవారు కూడా భవిష్యత్తులో ధనవంతులవుతారని ఆయన చాలా రోజులకు ముందే వెల్లడించారు. ఈ మధ్య కాలంలో కూడా ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, జాగ్రత్త పదండి.. అంటూ ఓ సుదీర్ఘ సందేశాన్ని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement