
రూ.1,000 పెరిగి రూ.1.40 లక్షలకు చేరిన ధర
రూ.600 తగ్గిన బంగారం
న్యూఢిల్లీ: వెండి ధర గురువారం దేశీయంగా సరికొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. కిలోకి రూ.1,000 పెరిగి రూ.1,40 లక్షలకు చేరింది. మరోవైపు కొన్ని రోజులుగా రికార్డుల బాటలో నడిచిన పసిడి (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ.630 నష్టపోయింది. రూ.1,17,370 స్థాయి వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ మార్కెట్లో వెండి ధర ఔన్స్‌కు 2 శాతానికి పైనే పెరిగి 45 డాలర్లకు చేరుకుంది.
దేశీయంగా ఎంసీఎక్స్ (ఫ్యూచర్స్) మార్కెట్లో డిసెంబర్ కాంట్రాక్టు వెండి ధర రూ.3,528 పెరిగి రూ.1,37,530 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. 10 గ్రా. బంగారం కాంట్రాక్టు ధర రూ.223 పెరిగి రూ.1,12,778కు చేరింది. రేట్ల తగ్గింపుపై ఫెడ్ సానుకూల వైఖరి, 2025లోనూ రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు ధరల పెరగుదలకు కారణమైనట్టు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.
అంతర్జాతీయంగా అనిశి్చతులకుతోడు డాలర్‌పై ఆధారపడడం తగ్గించుకోవడం అన్నవి బంగారం, వెండిలో కొనుగోళ్లకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్స్‌కు 8 డాలర్ల నష్టంతో 3,760 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.