ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి విలువైన లోహాలపై మరోసారి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈసారి ఆయన బంగారంతో పోలిస్తే వెండికే భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టులో.. వేల సంవత్సరాలుగా బంగారం, వెండి రెండూ డబ్బుగా ఉపయోగంలో ఉన్నాయని గుర్తు చేసిన కియోసాకి, నేటి టెక్నాలజీ యుగంలో వెండి ఒక “స్ట్రక్చరల్ మెటల్”గా మారిందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ఈ టెక్ యుగంలో వెండి అంతే కీలకమని పోలుస్తూ రాసుకొచ్చారు.
“వెండి ఇక కేవలం డబ్బు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవసరమైన లోహంగా మారుతోంది” అని కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు.
ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం విస్తరిస్తుండటంతో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం.
ధరల విషయానికి వస్తే, 1990లో వెండి ధర ఔన్స్‌కు సుమారు 5 డాలర్లు ఉండేదని, 2026 నాటికి అది సుమారు 92 డాలర్లకి చేరిందని కియోసాకి చెప్పారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2026లోనే వెండి ఔన్స్‌కు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.
WHY SILVER is SUPERIOR
Gold and silver have been money for thousands of years.
But…in today’s Technology Age….silver is elevated into an economic structural metal…. much like iron was the structural metal of
the Industrial Age.
In 1990…silver was approximately
$ 5.00 an…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 22, 2026


