
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఒక కేజీ సిల్వర్ రేటు ఈ రోజు (సెప్టెంబర్ 29) రూ. 1,60,000 వద్దకు చేరింది. ఈ సమయంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. బిట్‌కాయిన్, గోల్డ్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాభాలను పొందవచ్చని, పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా వెండిపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా లాభాలను పొందవచ్చని వెల్లడించారు.
''నా దగ్గర 100 డాలర్లు ఉంటే.. వెండి నాణేలను (Silver Coins) కొనుగోలు చేస్తాను. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. మీరు 100 డాలర్లు పెట్టుబడి పెడితే.. ఏడాదికి అదే 500 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. కాబట్టి నేను మరిన్ని వెండి నాణేలను కొనుగోలు చేస్తాను. మీరు కూడా వెండిపై ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు'' అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ షేర్ చేశారు.
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
2025 సెప్టెంబర్ 1వ తేదీ ఒక కేజీ వెండి ధర రూ. 1,36,000 వద్ద ఉండేది. ఈ రేటు ఇప్పుడు (సెప్టెంబర్ 29) రూ. 1,60,000కు చేరింది. దీన్నిబట్టి చూస్తే ఒక్క నెలరోజుల వ్యవధిలోనే కేజీ సిల్వర్ రేటు రూ. 24,000 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.
IF I HAD $100 WHAT WOULD I INVEST IN?
I WOULD BUY MORE SILVER COINS.
Silver has been manipulated for years.
In September 2025 Silver is about to explode. I predict your $100 in silver will be $500 in a year.
I am buying more tomorrow.
Please do not miss silvers explosion.…— Robert Kiyosaki (@theRealKiyosaki) September 28, 2025