
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్ (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
SILVER over $50.
$75 next ?
Silver and Ethereum hot, hot, hot.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 10, 2025
వెండి రేటు గ్లోబల్ మార్కెట్లో.. మొదటిసారి ఔన్స్‌కు 50 డాలర్ల స్థాయికి చేరి, 2012 నాటి గరిష్టాన్ని చెరిపేసింది. ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెండికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్స్ కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణుల అభిప్రాయం.
ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి
భారతదేశంలో 2025 అక్టోబర్ ప్రారంభంలో రూ. 1,61,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజు (అక్టోబర్ 10) రూ. 1,80,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 10 రోజుల్లో వెండి ధరలు ఎంతగా పెరిగాయో.. స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అక్టోబర్ 7 (గురువారం) వెండి రేటు ఏకంగా రూ. 7,000 పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు (శుక్రవారం) కూడా సిల్వర్ రేటు రూ. 3000 పెరిగింది. దీంతో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 180 రూపాయలకు చేరింది.