
ఇప్పటికే రికార్డు గరిష్టాలకు చేరిన వెండి ధరలు (Silver Price) మరింత పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే సంవత్సరంలో ఔన్స్‌కు 60 డాలర్ల వరకు పెరిగే అవకాశముంది. ఇది సంవత్సరానికి సుమారుగా 20% పెరుగుదలను సూచిస్తుందని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ తెలిపింది.
ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఈ వెల్త్ అడ్వయిజరీ సలహా విభాగం ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్‌లో 20 శాతం సరఫరా లోటు నెలకొన్న నేపథ్యంలో బలమైన పారిశ్రామిక డిమాండ్ వల్ల బుల్లిష్ దృక్పథం కొనసాగుతుందని అంచనా వేస్తోంది.
ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్ కియోసాకి
వెండి పెట్టుబడిదారులు ఇప్పటికే 2025 క్యాలెండర్ సంవత్సరంలో 90% లాభాన్ని సాధించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో, వెండి ధరలు ఔన్స్‌కు 49 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో సురక్షితమైన ఆస్థులకు డిమాండ్ పెరిగిపోవడం వల్ల వెండి ధరలు రికార్డు గరిష్టస్థాయికి చేరాయి. కామెక్స్ వెండి ఇప్పటివరకు సుమారు 70% పెరిగింది. ఎంసీఎక్స్ వెండి సుమారు 71% పెరిగింది.
(Disclaimer: నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)