ప్రజలకు గ్యాస్‌ తిప్పలు.. సిలిండర్ల కోసం పాట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు గ్యాస్‌ తిప్పలు.. సిలిండర్ల కోసం పాట్లు

Mar 15 2026 1:26 AM | Updated on Mar 15 2026 1:26 AM

హొసపేటె: వంటగ్యాస్‌ సమస్య కారణంగా అనేక హోటళ్లలో ఆహార తయారీ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీని వల్ల వినియోగదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. తక్షణమే సిద్ధమయ్యే అల్పాహారాలను తయారు చేసి వినియోగదారులను ఆకర్షించే కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. మరి కొన్ని చోట్ల కేవలం అన్నం, సాంబారు, చిత్రాన్నం మాత్రమే లభిస్తున్నాయి. కొన్ని హోటళ్లకు వాణిజ్య సిలిండర్లు మాత్రం యథావిధిగా సరఫరా అవుతున్నాయి. అయితే ఆమ్లెట్లకు గిరాకీ పెరుగుతోందని, గ్యాస్‌ కొరత కారణంగానే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ప్రస్తుతం ఇండక్షన్‌ కుక్కర్లను వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కిరోసిన్‌ స్టౌలు కూడా మళ్లీ వాడకంలోకి వస్తున్నాయి.

పెరిగిన సౌరశక్తి వాడకం

అనేక చోట్ల సౌరశక్తిని ఉపయోగించి భారీ ఎత్తున ఆహారాన్ని తయారు చేసే కేంద్రాలు కూడా పని చేస్తున్నాయి. అక్కడి నుంచి అనేక హోటళ్లకు నిర్ణీత సమయాల్లో ఆహారం సరఫరా అవుతోంది. గ్యాస్‌ సమస్య కారణంగా ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ వ్యవస్థపై కూడా ప్రభావం పడింది. దీంతో కొందరు ప్రజలు ఇప్పుడు ఇంటి భోజనానికే మొగ్గు చూపుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్‌ ఏజెన్సీల ఫోన్లకు ఎవరూ స్పందించక పోవడంతో ప్రజలు స్వయంగా ఏజెన్సీ కేంద్రాలకు వెళ్లి సిలిండర్లను తెచ్చుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హోటళ్లలో విందులు, పార్టీల నిర్వహణ తగ్గిపోయింది. ఆహార సరఫరా రంగంలో కూడా అనేక సమస్యలు తలెత్తాయి. వివాహాలు, ఇతర శుభ కార్యాల కోసం ఆహారాన్ని వండటానికి అవసరమైన గ్యాస్‌ కొరత కూడా తీవ్రంగా ఉంది.

నగరంలో కొన్ని హోటళ్లు మూత

మళ్లీ వాడకంలోకి కిరోసిన్‌ స్టౌలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement