తుమకూరు: తుమకూరు నగరంలో కొత్తగా నిర్మించిన షూటింగ్ రేంజ్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ మైదానాలు, బోటింగ్ వాటర్ స్పోర్ట్స్ సెంటర్‌లను ఆదివారం హోం మంత్రి జి.పరమేశ్వర్ ప్రారంభించారు. తుమకూరు యువత, క్రీడా ఔత్సాహికులకు మంచి సౌకర్యాలతో కూడిన స్టేడియంల అవసరం ఉందని అన్నారు. ఇందుకోసమే ఈ క్రీడా వసతులను నిర్మించామని చెప్పారు. జిల్లా కేంద్రం మధ్యలో ఇంత విశాలమైన చెరువు ఎక్కడా లేదన్నారు. చెరువులో కయాకింగ్ పడవ విహారం, అలాగే క్రీడా మైదానాలను నగరవాసులు, పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టరు శుభ కళ్యాణ్, ఎమ్మెల్యే జి.బి.జ్యోతిగణేష్, ఎస్పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


