మాదన్న దర్శనమే మహాభాగ్యం | - | Sakshi
Sakshi News home page

మాదన్న దర్శనమే మహాభాగ్యం

Mar 16 2026 7:39 AM | Updated on Mar 16 2026 7:39 AM

మైసూరు: రాష్ట్రంలోని ప్రసిద్ధ ఫుణ్యక్షేత్రం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని శ్రీ క్షేత్ర మలే మహాదేశ్వర బెట్టపై పరమేశ్వరుని దేవస్థానంలో జరిగే ఉగాది జాతర మహోత్సవానికి వేలాది మంది భక్తులు మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా కాలినడకన వస్తున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు నుంచి కూడా విశేషంగా యాత్రికులు మాదప్ప దర్శనం చేసుకోవడానికి శ్రమను లెక్కచేయకుండా బయలుదేరారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ పరిధిలోని 200కి పైగా గ్రామాల నుంచి భక్తులు పాదయాత్ర చేపట్టారు. అలుపు రాకుండా స్వామి నామాన్ని, భక్తి గీతాలను పాడుతూ గుంపులు గుంపులుగా వస్తారు. మొక్కు తీరినవారు, లేదా మొక్కుకున్నవారు వందల కిలోమీటర్ల దూరం నుంచి చెప్పులు లేకుండా నడవడం వారి అచంచల భక్తికి నిదర్శనం.

ఈసారి విశేష ఉగాది

బెట్టపై ఉగాది జాతర మహోత్సవం 16 నుంచి ప్రారంభమవుతుంది. 17న సాయంత్రం ఎన్నేమజ్జన సేవ జరుగుతుంది. 18, 19 తేదీలలో ఫాల్గుణ మాసం చివరి రోజు, అమావాస్య రోజున ప్రత్యేక పూజలు , ఉత్సవాలు జరుగుతాయి. ఉగాది అయిన 19వ రోజున తెల్లవారుజాము నుంచి పూజలు, ఉదయం 9:45 నుంచి 11 గంటల మధ్య మహారోత్సవం జాతర తదితరులు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఉగాది పండుగకు మరో ప్రత్యేకత ఏమిటంటే, ఫాల్గుణ అమావాస్య, చైత్ర పాడ్యమి దగ్గరగా ఉంటాయి. మరింత శుభప్రదమైనదని పండితులు తెలిపారు.

చిరుతల బెడద

ఉగాది వేడుకలకు కొండపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగస్వామి ఒడ్డు, శని మహాత్మ ఆలయం దగ్గర తరచుగా చిరుతపులి తిరగడం వల్ల భక్తులు భయపడుతున్నారు.

ఉగాది జాతరకు భక్తజనం

కాలినడకన రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement