పుస్తక పఠనంతో విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

పుస్తక పఠనంతో విజ్ఞానం

Mar 16 2026 7:24 AM | Updated on Mar 16 2026 7:24 AM

బళ్లారి అర్బన్‌: బళ్లారి నగరంలోని రాక్‌ గార్డెన్‌లో మాతృ మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని హాస్య కళాకారుడు ప్రాణేష్‌ ప్రారంభించి, మాట్లాడారు. నేటి కాలంలో మొబైల్‌ ఫోన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా పుస్తక పఠనానికి ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు. మాతృ మహిళ మండలి అధ్యక్షురాలు పుష్పలతా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ సమాజంలో వారికి పోత్రాహం కల్పించడమే మండలి లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కోమలిక, కీర్తి అధ్యక్షతగా వహించగా.. చంద్రికా చంద్రకాంత్‌ స్వాగతం పలికారు. గురు డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసీద, హిందు, ద్రాక్షాయిణి నృత్య ప్రదర్శలు చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా సామాజిక సేవకులు రత్నమ్మ, నీలమ్మను సన్మానించారు. అనంతరం నృత్యాలు, గేమ్స్‌, ఫ్యాషన్‌ షో నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌అనురాధ, హాస్య కళాకారుడు బసవరాజ్‌ మహామణి, పోలా పద్మవతి, ఎల్లనగౌడ, సునీత, కుసుమ, హేమ, దేవి, లక్ష్మీ, మేముదా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement