రాయచూరు రూరల్ : సామాజిక బహిష్కారం మనస్తాపానికి గురైన ఓ మహిళ నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదగిరి జిల్లా వడగేర తాలూకా జోళదడిగిలో చోటు చేసుకుంది. ఓ మహిళతో తన కుమారుడు ఎర్రిస్వామి అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ సమాజం నుంచి బహిష్కార నిర్ణయం ప్రకటించడంతో మనస్తాపం చెందిన యాదగిరి నివాసి కమలమ్మ(42) తన కుమార్తె ఉన్న జోళదడిగికి వెళ్లింది. అక్కడ భీమా నది బ్రిడ్జి కం బ్యారేజీ వద్ద మంగళ సూత్రాన్ని పెట్టి పైనుంచి దూకడంతో మరణించింది. ఘటనపై వడగేర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


