బళ్లారిఅర్బన్: నగరంలోని జిల్లా స్టేడియం సమీపంలో ఉన్న దివంగత కన్నడ సినీ నటుడు, కర్ణాటక రత్న డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ ప్రతిమను సోమవారం మహానగర పాలికె సిబ్బంది నీటితో అభిషేకించి శుభ్రపరిచారు. నిర్మితి కేంద్ర సమీపంలో రూ.కోట్లాది వ్యయంతో భారీ చెరువు నిర్మించి అదే ప్రాంగణంలో సుమారు 20 అడుగుల ఎత్తైన డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ ప్రతిమను ఏర్పాటు చేశారు. అయితే క్రమంగా నిర్వహణ కరువవడంతో ప్రతిమపై దుమ్ము, ధూళి పేరుకోవడంపై స్థానికుల ఫిర్యాదు మేరకు మేయర్ గాదెప్ప అక్కడికి చేరుకొని పరిశీలించారు. వెంటనే ప్రతిమను నీటితో అభిషేకించి శుభ్రం చేయించారు. అదే విధంగా చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రం చేయాలని ఆదేశించారు.


