మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు | Extramarital Affair Not Equal To Marriage High Court Dismisses Womans Case | Sakshi
Sakshi News home page

మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు

Mar 17 2026 8:30 AM | Updated on Mar 17 2026 8:30 AM

Extramarital Affair Not Equal To Marriage High Court Dismisses Womans Case

శివాజీనగర(బెంగళూరు): ఓ మహిళ (66) తన భర్త (77) అక్రమంగా రెండవ పెళ్లి చేసుకున్నాడని దాఖలు చేసిన కేసును  హెకోర్టు కొట్టివేసింది. భర్త పర స్త్రీతో సంబంధం కలిగి ఉండడం వివాహానికి సమానం కాదు, కాబట్టి కేసు చెల్లదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి నటరాజ్‌ కేసును విచారించారు. 

వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కేసు వర్తిస్తుందన్నారు. తన భర్త మరో మహిళ (51)ను వివాహం చేసుకొన్నారు, ఆయన కుమారులు మద్దతుగా నిలిచారు అని మహిళ ఆరోపించారు. ఆ తరువాత మహిళ భర్త, కుమారులు, ఆ మహిళ కేసును రద్దు చేయాలని పిటిషన్‌ వేశారు. చివరకు కేసు వీగిపోయింది. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement